AP: అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు A15 బాలాజీ, A20 సుదర్శన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తంబలపల్లి కోర్టులో హాజరుపరిచి మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. A1 జనార్దన్‌రావుకు వీరిద్దరూ స్పిరిట్ సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
KMM: జిల్లాలో రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై పోలీసులు నిఘా పెంచారు. ఈ మేరకు గత రాత్రి రికార్డుల్లో ఉన్న 225మంది ఇళ్లకు ఆకస్మికంగా వెళ్లిన పోలీసులు కదకలికలపై ఆరా తీశారు. ప్రస్తుత వృత్తి వివరాలు తెలుసుకున్నారు. ప్రతీ ఒక్కరిపై నిఘా ఉన్నందున ఏ చిన్న తప్పు చేసినా దొరిపోవడం ఖాయమని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు తప్పదన్నారు.
TPT: SPW యూనివర్సిటీలో నవంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్ను ‘నృత్య వాహిని’ పేరుతో నిర్వహించనున్నట్లు సాంస్కృతిక విభాగ ఆచార్యులు హిమబిందు పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి కళాకారులు విచ్చేస్తారని తెలియజేశారు. ఆసక్తి కలిగిన 16 ఏళ్ల పైబడి ఉన్న స్త్రీ, పురుషులు నవంబర్ 5వ తేదీలోపు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
SRD: అనాలోచితంగా BHEL (LIG) లో MMTS రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారని గ్రాడ్యుయేట్స్ MLC అంజిరెడ్డి అన్నారు. HITTTV ప్రతినిధితో మాట్లాడుతూ.. అసాంఘిక కార్యక్రమాలకు LIG రైల్వే స్టేషన్ అడ్డాగా మారిందని అన్నారు. గంజాయి కుకెన్ మాదకద్రవ్యాలకు నిలయంగా మారిన రైల్వే స్టేషన్ పై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీతో మాట్లాడతానని అంజిరెడ్డి అన్నారు. వేలకోట్ల ప్రజాధనం వృధా అన్నారు.
GDWL: కేటీదొడ్డి మండలం పరిధిలోని శ్రీ పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని మహబూబ్‌నగర్ ఎంపీ డీ.కె. అరుణ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో పురేందర్, అర్చకులు ఎంపీకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అరుణతో పాటు గద్వాల జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
BDK: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ పార్టీ గెలుపు సొంతం చేసుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షుడు మలకం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం గొల్లగూడెం గ్రామంలో గులాబీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.
VZM: నగరంలో రవాణా శాఖాధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉపరవాణా కమిషనర్ మణికుమార్, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లతో కలిసి వాహన రికార్డులు, ఫైర్ ఎక్విప్మెం ట్, సీటింగ్ బెర్త్‌లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 4 వాహనాలను సీజ్ చేసి ఆర్టీఓ కార్యాలయానికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.
W.G: జిల్లాలో ఈనెల 28, 29 తేదీల్లో మొంథా తుపాన్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రి సెల్వి శనివారం విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. ఐరన్ రేకులు ఎగిరిపోయే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు వహించాలన్నారు. జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వివరించారు.
SKLM: రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో వైసీపీ నాయకులు ఆదివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వైసీపీ అధ్యక్షులు గొర్లె శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అదేవిధంగా ఈనెల 28న ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు.
BDK: టేకులపల్లి మండలం సంపత్ నగర్ పాలవాగులో ఇసుక దందా రోజు రోజుకు పెరిగిపోతుందని స్థానికులు ఆదివారం చెప్పారు. ఉన్నతాధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన పరిష్కరించడం లేదని స్థానికులు ఆరోపించారు. దాంతో స్థానికులు ఇసుక దందాకు పాల్పడుతున్న వారిపై తిరగబడి అడ్డుకున్నారు. స్థానికుల చొరవతో గొడవ సర్దుమడిగింది.
TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ అచ్చంపేటకు వెళ్లనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చపేటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగే ఆదివాసి చెంచుల 108 జంటలకు వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే వివాహాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అనంతరం తిరిగి రాజ్‌భవన్‌కు వెళ్తారు.
NLG: త్రిపురారం మండలం మాటూరు చౌళ్ళ, సీత్యా, కన్యా తండాల అయ్యప్ప స్వాములు ఆదివారం వేకువజామునే మిర్యాలగూడలోని అయ్యప్ప ఆలయంలో మాలలు ధరించారు. గురుస్వామి, మాజీ సర్పంచ్ వాంకుడోత్ పాండు నాయక్ స్వామి ఆధ్వర్యంలో ఈ కార్య క్రమం జరిగింది. భజన, భక్తి పాటలతో ఆలయ ప్రాంగణం భక్తి శోభను సంతరించుకుంది. వీఆర్ఎ నాగయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.
HYD: మహానగర అభివృద్ధి సంస్థ HMDA పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. నగర పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి కొత్త ప్రణాళికలను అధికారులు రూపొందిస్తున్నారు. RRR వరకు విస్తరించిన పరిధిలో ఘట్‌కేసర్, శంషాబాద్, శంకరపల్లి 1-2, మేడ్చల్ 1-2 జోన్లను విభజించి, ప్రతి జోన్‌లో ప్రత్యేక అధికారులు, సాంకేతిక సిబ్బందిని నియమించే అవకాశముంది. జోనింగ్‌పై ఫోకస్ పెట్టింది.
కృష్ణా: నాగుల చవితి సందర్భంగా మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి శనివారం ఒక్కరోజులో వివిధ సేవల టిక్కెట్ల ద్వారా రూ.5,40,893 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో వివరించారు.
కృష్ణా: రాబోయే 2,3 రోజుల్లో వచ్చే తుఫాన్ పట్ల కృష్ణాజిల్లా రైతాంగం అప్రమత్తంగా ఉండాలని ఎంపీ బాలశౌరి ఆదివారం కోరారు. తుఫాను తీవ్రత వల్ల గట్లు తెగే అవకాశం ఉందని, డ్రైన్‌లు పొంగి పొరలుతాయని పంటను రక్షించుకోవడం కోసం రైతులు సదరు సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ విషయంలో ఏమన్నా ఇబ్బందులు ఎదురైతే తన కార్యాలయానికి సమాచారం ఇవ్వాలన్నారు.