NLR: మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి 4వార్డులకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వైఓ. నందన్ తెలియజేశారు. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు సంసిద్ధంగా ఉన్నామని అన్నారు. కమిషనర్ చాంబర్లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కమిషనర్ మాట్లాడారు.
WNP: అవగాహనతో క్షయ వ్యాధిని అరికట్టవచ్చని గ్రామీణ వైద్యుడు శ్రీకాంత్ తెలిపారు. ఘనపూర్ మండలం ఆగారంలో ఇవాళ నిర్వహించిన ప్రత్యేక హెల్త్ క్యాంప్‌లో ఆయన మాట్లాడుతూ.. పొగాకు, ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు, 60ఏళ్ళు పైబడినవారు, క్షయ వ్యాధి లక్షణాలు కలిగిన ప్రతి ఒక్కరూ ఎక్సరేలు, గల్ల పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత మున్నూరు జయకర్ పాల్గొన్నారు.
AP: రాష్ట్రంలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్ మొదలైంది. ఈ క్రమంలో విశాఖ, శ్రీకాకుళం, నెల్లూరు, బాపట్ల, విశాఖలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. నిజాంపట్నం హార్బర్‌లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. కాగా కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి.
AKP: నక్కపల్లి మండలంలో 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో సీతారామరాజు తెలిపారు. సోమవారం బోయపాడులో తుఫాన్ షెల్టర్‌ను సందర్శించి, ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. బంగారమ్మ పేట, అమలాపురం, డీఎల్ పురం, దొండవాక, తీనార్ల, రాజయ్యపేట, డీ.ఎల్.పురం, బోయపాడు గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
KRNL: ఆదోని టీడీపీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నాయుడు సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అర్హులైన 16 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 7,77,422 విలువైన చెక్కులను ఆయన అందజేశారు. అనారోగ్యాలతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఖర్చుల వల్ల ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, పేద కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు.
NLG: చింతపల్లి మండలం మోదుగుల మల్లేపల్లిలో నిర్మించ తలపెట్టిన శ్రీ కూర్మాచల సీతాలక్ష్మణ హనుమాన్ సమేత శ్రీ రామచంద్ర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యానాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు.
ATP: ఆత్మకూరు మండలం పంపనూరు తండాలోని నూతనంగా వెలసిన శ్రీ కాళికామాత ఆలయంలో సోమవారం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి రావాలని ప్రజలను ఆహ్వానించారు.
KMR: నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మండల వ్యవసాయ అధికారి గోపాల్ పరిశీలించారు. 17% కంటే తక్కువ మ్యాచర్ వచ్చేవరకు వరి ధాన్యాన్ని ఆరబెట్టాలని సూచించారు. ఎండిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు.
GNTR: తెనాలి రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి తేజ వెయిట్ లిఫ్టింగ్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రేవేంద్రపాడులో మూడు రోజులు జరిగిన రాష్ట్రస్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తేజ ఈ ఘనత సాధించాడు. అండర్-17 కేటగిరీలో పోటీ పడిన తేజ సిల్వర్ మెడల్‌ను గెలుచుకున్నట్లు పాఠశాల HM భారతి తెలిపారు.
MDCL: పోలీస్ సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని మేడిపల్లి పోలీస్ ఆధ్వర్యంలో బోడుప్పల్ ఎన్టీఆర్ విగ్రహం నుంచి కమాన్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ.. ప్రజల రక్షణకోసం ప్రాణాలు పణంగా పెట్టే పోలీసు అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, యువతలో సేవాస్పూర్తిని పెంపొందించడమే ఈర్యాలీ లక్ష్యమన్నారు.
VKB: ప్రాథమిక పాఠశాలల సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కుల్కచర్ల మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే అన్ని పాఠశాలలకు పరీక్ష పేపర్స్ పంపిణీ చేశామని MEO హబీబ్ అహ్మద్ తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలని ఉపాధ్యా యులకు MEO సూచించారు.
CTR: పాలసముద్రం మండల నూతన ఎస్సైగా రాజశేఖర్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. సాధారణ బదిలీల్లో భాగంగా నారాయణవనం నుంచి బదిలీపై వచ్చానని అన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు. మండలంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
W.G: ‘మొంథా’ తుఫాన్ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో మొత్తం 28 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. నరసాపురం డివిజన్‌లో 10, తాడేపల్లిగూడెం డివిజన్‌లో 8, భీమవరం డివిజన్‌లో 10 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అదనంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
NDL: పాణ్యం మండలం కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దంపతులు సోమవారం పర్యటించారు. కార్తీక మాసం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామి వారికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆయన సతీమణి కాటసాని జయమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
ASR: మొంథా తుఫాన్ ప్రభావంతో గూడెం కొత్త వీధి మీదుగా భద్రాచలం, సీలేరు వెళ్లే బస్సులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎస్సై సురేష్ తెలిపారు. కొండ చరియలు జారిపడే ప్రమాదం దృష్ట్యా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పరిస్థితులు సాధారణం అయిన తర్వాత సర్వీసులు పునరుద్ధరించబడతాయని ఆయన చెప్పారు.