ముందస్తు ఎన్నికలకు వెళదాం అంటూ మంత్రి కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాళ్లు విసరుకున్నారు. నిజామాబాద్ పర్యటనలో నిన్న మంత్రి కేటీఆర్ కామెంట్ చేయగా, ఈ రోజు బండి సంజయ్ స్పందించారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని బండి తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ అని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ తన తండ్రితో చెప్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీలో కోవర్డులు ఉండర...
రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు ఢిల్లీలోని విజయ్ చౌక్ లో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ముగింపు సందర్భంగా బీటింగ్ రీట్రీట్ ను నిర్వహిస్తున్నారు. మిలిటరీ బ్యాండ్ 29 ఇండియన్ ట్యూన్లను ప్లే చేస్తున్నారు. అలాగే.. 3500 స్వదేశీ డ్రోన్లతో ప్రదర్శన జరగనుంది. భారీగా వర్షం కురుస్తున్నా బీటింగ్ రీట్రీట్ ...
కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడీ యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర చివరి మజిలీగా శ్రీనగర్‌లో ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రఖ్యాత లాల్ చౌక్ వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు రాహుల్. సోనావార్‌లో 30 నిమిషాల పాటు బ్రేక్ తీసుకున్నప్పుడు మౌలానా ఆజాద్ రోడ్డులోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయానికి రాహుల్ వెళ్లారని, అక్కడ నుంచి ఘంటా ఘర్...
ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం తప్పింది. ఘాట్ దిగుతున్న సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సు వేగాన్ని నియంత్రించుకోలేకపోవడంతో డ్యామ్ రక్షణ గోడను ఢీకొట్టింది. రక్షణ గోడ కూలిపోగా అక్కడే ఉన్న ఇనుప రాడ్ అడ్డు పడడంతో బస్సు ఆగిపోయింది. లేకుంటే బస్సు నేరుగా శ్రీశైలం డ్యామ్ లోకి పడిపోయి ఉండేది. ఈ ఘటనతో బస్సులోని 30 మంది ప్రయాణికులు భయాందోళన చెందారు. బస్సు ఆగిపోవడంతో దేవుడా అంటూ ఊపిరి పీ...
మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. తల్లి అంజనా దేవి జన్మదినం సందర్భంగా ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు సోదరిమణులు ఒక్క చోటకు చేరారు. వారితో పాటు వారి పిల్లలు, కోడళ్లు, మనుమలు, మనువరాళ్లతో చిరంజీవి నివాసం సందడిగా మారింది. జనవరి 29 చిరంజీవి తల్లి జన్మదినం. ప్రతి యేటా ఆమె పుట్టిన రోజును కుటుంబసభ్యులు అందరి కలిసి ఘనంగా నిర్వహిస్తారు. గతేడాది కరోనా కారణంగా చిరంజీవి దూరంగా ఉన్నారు. తాజాగా ఆదివ...
ఈరోజుల్లో ఎక్కడ చూసినా కోతులే కనిపిస్తున్నాయి. ఇదివరకు అడవుల్లోనే కోతులు కనిపించేవి. కానీ.. ఇప్పుడు మాత్రం అడవులను వదిలేసి కోతులు ఊళ్ల మీద పడ్డాయి. ఇళ్లలోకి కూడా చొరబడుతున్నాయి. దొరికింది దొరికినట్టుగా అందుకొని పారిపోతున్నాయి. కొందరు కోతులను చూస్తేనే భయపడతారు. అవి చేసే చేష్టలు కూడా అలాగే ఉంటాయి. ఒంటరిగా కోతులు ఉన్న చోటుకు వెళ్తే ఇక అంతే. అన్నీ మీద ఎగబడటం ఖాయం. అందుకే కోతులకు ఎంత దూరంగా ఉంటే అంత...
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆరోపించారు. 3 నెలల నుంచి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని పేర్కొన్నారు. రహస్యాలు మాట్లాడుకునేందుకు తనకు మరో ఫోన్ ఉందన్నారు. 12 సిమ్ కార్డులు కూడా తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్‌ను పెగాసస్ రికార్డు చేయలేదని స్పష్టంచేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్...
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నందమూరి అభిమానులకు తెలిపారు. ఇవాళ ఉదయమే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్నను పరామర్శించిన అనంతరం ఇద్దరు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27 వ తారీఖున మా కుటుంబంలో దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకుంది. ఇది చాలా దురదృష్టకర...
మధ్యప్రదేశ్ లోని పన్నాలో దారుణం చోటు చేసుకుంది. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్లు తిరిగి చెల్లించడం లేదని జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యాపారి తన భార్యను చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ముందు ఇది హత్యగా భావించిన పోలీసులు.. దర్యాప్తు చేస్తుండగా సూసైడ్ నోట్ దొరికింది. అందులో ఆ వ్యాపారి పలు విషయాల గురించి ప్రస్తావించాడు. ఆ వ్యాపారి పేరు సంజయ్ సేత్. ఆయన భగేశ్వర్ ధామ్ బాబా భక్తుడు. గురూజీ [&he...
కాలా చష్మా పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ పాట ఒకప్పుడు దుమ్ములేపింది. ఏ వేడుకలో చూసినా ఆ పాట వేసుకొని డ్యాన్స్ వేసేవాళ్లు. అకేషన్ ఏదైనా డీజే పెట్టాల్సిందే. ఆ పాట ప్లే కావాల్సిందే. ఆ పాట సృష్టించిన రికార్డ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. యూట్యూబ్ లోనూ ఆ వీడియోను కొన్ని కోట్ల మంది వీక్షించారు. బార్ బార్ దేకో సినిమాలోని ఆ పాటకు కత్రినా, సిద్ధార్థ్ మల్హోత్రా ఇద్దరూ కలిసి [&h...
ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్‌పై ఓ ఎఎస్‌ఐ ఛాతిలో కాల్పులు జరిపాడు. వెంటనే మంత్రిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విమానంలో భువనేశ్వర్ తరలించి, అక్కడ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించనున్నారు. మంత్రి నబా దాస్ జార్పుగూడ జిల్లా బ్రజ్ రాజ్ నగర్‌కు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. గాంధీ సెంటర్ వద్ద కారు దిగుతున్న సమయంలో ఎఎస్‌ఐ సమీపంలో ఉండి కాల్పులు జరిపాడు. మంత్రిని గురిచేసి ఐదు ర...
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థతిపై నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అంతా నిలకడగానే ఉందని, పరిస్థితిపై ఆందోళన అవసరం లేదన్నారు. ఇంప్రూవ్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. డాక్టర్లు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తారకరత్న అందరితో కలివిడిగా ఉండే...
గుజరాత్ లో జూనియర్ క్లర్క్ నియామక పరీక్షను అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పరీక్షకు రెండు గంటల ముందు హైదరాబాద్ లో పేపర్ లీక్ అయిందని అధికారులు గుర్తించారు. ఈ ప్రశ్నాపత్రాన్ని హైదరాబాద్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రించినట్లు గుర్తించి, ప్రెస్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సహా 15 మందిని పోలీసు...
భారతీయ స్టాక్ మార్కెట్లు గతవారం రెండు సెషన్లలోనే రూ.10 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఇందుకు ప్రధాన కారణం హిండేన్ బర్గ్ రీసెర్చ్ ఇటీవల అదానీ గ్రూప్ పైన సంచలన ఆరోపణలు చేయడమే. ఈ రీసెర్చ్ సంస్థ దెబ్బతో అదానీ స్టాక్స్ కుప్పకూలాయి. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతం అదానీ ఇప్పుడు 7వ స్థానానికి పడిపోయాడు. అదానీ గ్రూప్ మార్కెట్ వ్యాల్యూ రూ. 4 లక్షల కోట్లకు పైగా క్షీణించింది. న్యూయార్క్ కేంద్రంగా ప...
బెంగళూరు నారాయణ హృదయాల ఆస్పత్రికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో పాటు నారా బ్రాహ్మణి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. అవసరమైతే విదేశాల నుంచి ప్రత్యేక వైద్యుల్ని పిలిపించాలని కుటుంబీకులు కోరారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని, 48 గంటలు గడిస్తేనే ఏమైనా చెప్పగలమని వైద్య...