మూడు రాజధానుల విషయంలో…. ఆంధ్రప్రదేశ్ లోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం రోజు రోజుకీ పెరుగుతోంది. అమరావతినే రాజధానిగా ఉంచాలని ఓ వైపు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే…. మూడు రాజధానులు పెట్టితీరతామని అధికార పార్టీ చెబుతోంది.
కాగా… ఈ విషయంలో తాజాగా..టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైరయ్యారు. రాజధానిపై కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర ప్రజలు బతుకు పోరాటం చేస్తున్నారని ధర్మాన పేర్కొన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ప్రాంతాల మధ్య అసమానతలు ఉండకూడదని.. ఒక్కచోట అభివృద్ధి జరిగితే మిగిలిన ప్రాంతాలు వెనుకబడతాయని ఆయన అన్నారు.
అందుకే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల్లో ఆవేదన కనిపిస్తోందన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని వస్తే మీకు వచ్చిన నష్టమేంటి? అని ధర్మాన.. చంద్రబాబుని ప్రశ్నించాడు. ఉత్తరాంధ్రకు ఒక్కసంస్థనైనా చంద్రబాబు తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు. టీడీపీకి అండగా నిలిచిన ఉత్తరాంధ్రకు చంద్రబాబు అన్యాయం చేశారని మండిపడ్డారు. విశాఖలో సెంటిమెంట్ లేదని అంటారా.. అమరావతిలో సెంటిమెంట్ ఉంటే లోకేష్ ఎందుకు ఓడిపోయాడని ఆయన నిలదీశారు.