పోయిన వారం.. అంటే దసరా సందర్భంగా తెలుగులో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’తో పాటు ‘స్వాతిముత్యం’ అనే సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ‘ది ఘోస్ట్’ తప్పితే మిగతా సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే ఇవి కేవలం తెలుగు సినిమాలు మాత్రమే. కానీ ఈ వారం అన్ని భాషల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అవన్నీ కూడా మీడియం, స్మాల్ బడ్జెట్ మూవీసే. మొత్తంగా అక్టోబర్ 14, 15 తేదీల్లో దాదాపు పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
అయితే ఈ సినిమాల పేర్లు కూడా జనాలకు సరిగ్గా తెలియకుండా ఉన్నాయి. దాంతో ఏ సినిమా రిలీజ్ అవుతుందనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందుకే వీటిపై ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు. అయినా బాక్సాఫీస్ పై దండయాత్ర గట్టిగానే ఉంటుందని చెప్పొచ్చు. ఈ సినిమాలలో కాస్త చెప్పుకోదగ్గ సినిమా.. ఆది సాయికుమార్ నటిస్తున్న ‘క్రేజీ ఫెలో’ అని మాత్రమే చెప్పాలి. అలాగే హెబ్బా పటేల్ నటిస్తున్నా’గీత’ మూవీ కూడా ఉంది. వీటితో పాటు ‘బోయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’.. ‘నిన్నే పెళ్ళాడుతా’.. ‘నా వెంటపడుతున్న చిన్నవాడెవడమ్మా’.. ‘లెహరాయి’.. ‘అడివి’.. ‘నీతో’.. ‘రుద్రనేత్ర’ అనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఇక కన్నడ నుంచి కెజియఫ్ హీరో యశ్ నటించిన ‘రారాజు’ అనే డబ్బింగ్ సినిమాతో పాటు.. ‘కాంతారా’ అనే బ్లాక్ బస్టర్ మూవీని.. అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. అయితే పెద్ద పెద్ద సినిమాలకే జనాలు థియేటర్‌కు వెళ్లడం లేదు. అలాంటి ఏ మాత్రం బజ్ లేని ఈ సినిమాలను చూస్తారా.. అనేది సందేహమే. ఏదేమైనా ఇన్ని సినిమాల్లో ఏది అకట్టుకుంటుందో చూడాలి.