పూరి జగన్నాథ్ తన ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ను భారీ స్థాయిలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అందుకోసం బాలీవుడ్ బడా ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌తో చేతులు కలిపాడు పూరి. అందుకు తగ్గట్టే రిలీజ్‌కు ముందు లైగర్ పైభారీ హైప్ వచ్చింది. కానీ చివరికి సీన్ రివర్స్ అయిపోయింది. ఇటు పూరి, విజయ్ దేవరకొండలతో పాటు.. కరణ్‌కు కూడా షాక్ ఇచ్చింది లైగర్. మొత్తంగా లైగర్ భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
ఇక కరణ్ జోహార్ నుంచి ఈ ఏడాది వచ్చిన మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమా పై బాయ్ కాట్ బ్యాచ్ ఎఫెక్ట్ పడినా.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పైగా ఈ ప్రాజెక్ట్‌లో రాజమౌళి హ్యాండ్ ఉండడంతో బ్రహ్మాస్త్రకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగులో మంచి వసూళ్లే దక్కాయి. కానీ మిగతా భాషల్లో మాత్రం అంతగా రాబట్టలేకపోయింది. దాంతో ఫైనల్‌గా బ్రేక్ ఈవెన్ కాలేకపోయిన బ్రహ్మాస్త్ర.. 100 కోట్లకు పైగానే నష్టాల్ని మిగిల్చినట్టు ట్రేడ్ వర్గాల మాట.
ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ట్విట్టర్‌కు గుడ్ బై చెప్పాడు కరణ్. చివరగా ‘మరింత పాజిటివ్ వైబ్స్ కోసం ట్విట్టర్‌కు వీడ్కోలు చెబుతున్నాను.. ఇప్పుడు ఇలా చేయడమే కరెక్ట్.. గుడ్‌బై ట్విట్టర్..’ అని ప్రకటించాడు. అలాగే ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డీయాక్టివేట్ చేశాడు. దాంతో ‘బాయ్‌కాట్ బాలీవుడ్’తో పాటు.. కాఫీ విత్ కరణ్ షో పై వస్తున్న ట్రోల్స్ ఇందుకు కారణమనే చర్చ జరుగుతోంది. మరి కరణ్ మళ్లీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి.