NRML: పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఉత్తీర్త సాధించాలని DEO భోజన్న అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని కేజీబీవీ పాఠశాలను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల తరగతిగదికి వెళ్లి పలు అంశాలను వివరించారు. అనంతరం వంటగదిని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు.