KMM: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మధిరలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఛైర్పర్సన్ సామినేని సుజాత పర్యవేక్షణలో 1, 4, 8, 12, 22వ వార్డుల్లో కౌన్సిలర్లు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శివకృష్ణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.