పుష్పరాజ్‌గా మాసివ్ ఫర్ఫార్మెన్స్తో దుమ్ముదులిపేశాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాలో బన్నీ డైలాగ్స్, మేనరిజమ్‌కు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా తగ్గేదేలే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో నానా రచ్చ చేస్తునే ఉంది. అందుకే ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న బన్నీ.. అవార్డుల విషయంలోను తగ్గేదేలే అంటున్నాడు. దాంతో ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు ఆయా ఫిలిం ఫెస్టివల్స్‌లో అత్యధిక అవార్డ్స్ దక్కాయి. ముఖ్యంగా నటన పరంగా.. సైమా, ఫిలింఫేర్‌తో పాటు పలు అవార్డులను దక్కించుకున్నాడు బన్నీ. ఇప్పుడు తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును అందుకున్న తొలి సౌత్ ఇండియన్ స్టార్‌గా నిలిచాడు బన్నీ. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా బన్నీ ఈ అవార్డును అందుకున్నాడు.
ఈ సందర్భంగా ఈ అవార్డు తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు బన్నీ. అలాగే సోషల్ మీడియాలో థ్యాంక్స్ చెప్పాడు. దాంతో ప్రస్తుతం ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాడు బన్నీ. ఇక ఇదే ఊపుతో పుష్ప2ని అంతకుమించి అనేలా తెరకెక్కించబోతున్నారు బన్నీ-సుకుమార్. దీపావళి తర్వాత.. అంటే ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల ఆరంభంలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి గ్రాండ్‌గా రానున్న పుష్ప2.. ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.