WNP: తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వక పోవడంతో ఓ వ్యక్తి ఇంటికి తాళం వేసిన మహిళపై కేసు నమోదు చేశామని రేవల్లి ఎస్సై రజిత తెలిపారు. డబ్బు ఇవ్వమని కోరిన శివలీల కొంత సమయ మిస్తే ఇస్తానని భాస్కర్ చెప్పగా వినకుండా ఇంటికి తాళం వేసి దూషించింది. బాధితుడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటికి తాళం వేసిన మహిళపై పోలీసులు కసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.