సత్యసాయి: హిందూపురం పట్టణం 11వ వార్డు ప్రజలకు సోమవారం ఉచితంగా పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహకారంతో వార్డు కౌన్సిలర్ అంజలి రమేశ్ రెడ్డి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్కన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.