WG: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ మండలాధ్యక్షుడు ఆరేటి వెంకట రత్నప్రసాద్ అన్నారు. కాళ్లకూరు సొసైటీ వద్ద రైతన్న మీకోసం వారోత్సవాలను సోమవారం నిర్వహించారు. వ్యవసాయాన్ని సాంకేతిక విధానాలలో సాగుచేసి అధిక లాభాలు పొందాలని ఏవో పి. రమేష్ నాయుడు రైతులకు సూచించారు. సొసైటీ ఛైర్మన్ ప్రణవమూర్తిరాజు, సర్పంచ్ సాదు శ్రీదేవి పాల్గొన్నారు.