‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంగీత దర్శకుడు తమన్ రాలేకపోవడానికి గల కారణాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ వివరించాడు. ఈ నెల 19న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో, తమన్ రాత్రింబగళ్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉన్నాడని తెలిపాడు. స్టేజ్ మీద కనిపించడం కంటే, సినిమాకు మంచి అవుట్పుట్ ఇవ్వడమే ముఖ్యమని అన్నాడంటూ తమన్ సంస్కారాన్ని ప్రశంసించాడు.