BHPL: చిట్యాలలో సోమవారం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న సమాచారం మేరకు పోలీసులు రెండు గ్రూపులుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. SI మధుసూదన్ ఆధ్వర్యంలో జడల్ పేట క్రాస్ వద్ద ఒక ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. అలాగే హెడ్ కానిస్టేబుల్ సురేందర్, కానిస్టేబుళ్లు అస్లాం, సందీప్ పర్యవేక్షణలో ఇంకో ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. డ్రైవర్ సదయ్య, రాజేష్‌పై కేసు నమోదు చేశారు.