PDPL: రామగుండం NTPC-TTS ఆవరణలో రూరల్ స్పోర్ట్స్ మీట్స్ను, GM ముకుల్ రాయ్ సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను క్రీడా రంగంలో ప్రోత్సహించేందుకే వాలీబాల్, ఖోఖో పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కమాన్పూర్, అంతర్గాం, పాలకుర్తి, రామగుండం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు.