MDK: చిన్న శంకరంపేట(M) జంగరాయిలో వృద్ధ దంపతులు సావిత్రమ్మ, అంజయ్యలపై దాడి చేసి 4.5 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సావిత్రమ్మ మనవరాలి భర్త కామారెడ్డి జిల్లా మాసన్ పల్లికి చెందిన వెంకటనారాయణ(40) ఈ దాడికి పాల్పడి దోచుకెళ్లినట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.