SRPT: కోదాడ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డాక్టర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని, అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారరు. అలాగే ప్రమాద సమయంలో ఎగ్జిట్ మార్గాల ప్రాముఖ్యత, అగ్నిమాపక పరికరాలను ఎలా ఉపయోగించాలో సిబ్బందికి ప్రత్యక్షంగా వివరించారు.