NRML: దిలావర్పూర్ గ్రామంలోని జూనియర్ కళాశాల ప్రాంతంలో నిర్మిస్తున్న రైస్ మిల్కు అనుమతులు ఇవ్వకూడదని గ్రామస్తులు MPO, సర్పంచ్, EO, ఉప సర్పంచ్లను శనివారం కోరారు. పరిసరాల్లో విద్యాసంస్థలు, నివాస గృహాలు, దేవాలయాలు ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీరేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.