• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భీమవరం హలీం సెంటర్లలో తనిఖీలు..!

W.G: భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని హలీం సెంటర్లలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రామ సుందర్ రెడ్డి సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో హలీం తయారీలో సింథటిక్ రంగులు వాడవద్దని, హానికరమైన ప్లాస్టిక్ కవర్లను వినియోగించరాదని యాజమాన్యాలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 17, 2026 / 11:09 AM IST

గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: SI

WGL:నల్లబెల్లి (M) కేంద్రంలోని శనిగరం జాతీయ రహదారి వద్ద సోమవార అర్ధరాత్రి SI గోవర్ధన్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు యువకుల వద్ద నుండి 951 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు SI పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

March 17, 2026 / 11:08 AM IST

రెడ్డివారికుంట చెరువు మరమ్మతులకు భూమిపూజ

సత్యసాయి: కనగానపల్లిలోని రెడ్డివారికుంట చెరువు మరమ్మతు పనులను MLA పరిటాల సునీత ప్రారంభించారు. 2024లో కురిసిన భారీ వర్షాలకు ఈ చెరువు తెగిపోగా, ప్రభుత్వం DMF గ్రాంట్ నుంచి రూ. 86 లక్షల నిధులు మంజూరు చేసింది. స్థానిక కూటమి నాయకులతో కలిసి ఆమె భూమిపూజ చేశారు. రైతులకు ప్రయోజనం కలిగేలా పనులను నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టరును ఆదేశించారు.

March 17, 2026 / 11:08 AM IST

ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ వద్ద AITUC ఆధ్వర్యంలో ఆందోళన

MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ వద్ద ఏఐటీయూసీ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రాజెక్టు అధికారికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. కార్మికుల సొంత ఇంటి పథకం అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని కోరారు.

March 17, 2026 / 11:08 AM IST

AP PGECET దరఖాస్తు గడువు పొడిగింపు

AP PGECET-2026 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు మార్చి 20లోపు రిజిస్ట్రేషన్‌లు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మొదట మార్చి 16 వరకు గడువు పొడిగించగా తాజాగా మరో అవకాశం ఇచ్చింది. అభ్యర్థులకు ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో ప్రవేశ పరీక్ష జరుగనుంది.

March 17, 2026 / 11:08 AM IST

రెసిడెన్షియల్ విద్యాలయాలకు ప్రత్యేక అధికారులు

SRCL: ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాలయాలకు పకడ్భందీ నిర్వహించనున్నారు. అలాగే వసతులు పరిశీలించేందుకు, మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి తినేందుకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక అధికారులను నియమించారు. జిల్లాలోని ఆయా మండలాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యాలయాలకు నియమించారు.

March 17, 2026 / 11:07 AM IST

మా నాన్నకు ఆ గుర్తింపు అవసరం లేదు: ఈషా

ఆస్కార్‌ వేడుకల్లో ధర్మేంద్రకు తగిన గౌరవం దక్కలేదనే విమర్శలపై ఆయన కుమార్తె ఈషా స్పందించింది. తన తండ్రి ఎప్పుడూ గుర్తింపు కోసం ఆశపడలేదని, ఇలాంటి వేడుకలను ఆయన అస్సలు పట్టించుకోరని స్పష్టం చేసింది. హేమమాలిని సైతం స్పందిస్తూ.. ధర్మేంద్రను విస్మరించడం బాధాకరమే అయినా, కోట్లాది మంది అభిమానుల ప్రేమే ఆయనకు అసలైన అవార్డు అని పేర్కొంది.

March 17, 2026 / 11:06 AM IST

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు.. అసెంబ్లీలో చర్చ

TG: రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం అందజేశారు. ప్రస్తుత బడ్జెట్‌లోనే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం నిధులు కేటాయించాలని కోరుతూ చర్చ పెట్టాలని కోరారు. మరోవైపు సీపీఐ కూడా రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్‌పై చర్చకు డిమాండ్ చేయనుంది.

March 17, 2026 / 11:05 AM IST

పోచారం ప్రాజెక్ట్ నేటి ఔట్ ఫ్లో 256 క్యూసెక్కులు

KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి విడుదల పలు దశల్లో కొనసాగుతుంది. మంగళవారం ప్రాజెక్టు నుంచి 256 క్యూసెక్కుల నీటిని యాసంగి పంట కోసం విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. 26 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారుతుందని, ఎటువంటి ఇన్ ఫ్లో లేదని తెలిపారు. ఇప్పటివరకు యాసంగి పంట కోసం 0.783 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.

March 17, 2026 / 11:05 AM IST

‘ఉగాది నాటికి ధర్‌పల్లిలో ప్రతి ఇంటిపై కాషాయ జెండా’

NZB: ధర్‌పల్లి గ్రామంలో శ్రీ పరాబావ నామ సంవత్సర ఉగాది పండుగ నాటికి గ్రామంలో ప్రతి ఇంటిపై కాషాయ ధ్వజం (భగవ ధ్వజం) ఎగురవేయాలని బీజేపీ మండల శాఖ అధ్యక్షులు జిర్ర మైపాల్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కాషాయ జెండాలు హనుమాన్ మందిర్ వద్ద పంపిణీ చేశారు.

March 17, 2026 / 11:02 AM IST

‘సింగరేణి అధికారుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం’

PDL: గోదావరిఖని సింగరేణి అధికారుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఆర్జీ-1 ఏరియాలో సీఎంఓఏఐ నాయకులు జీఎం లలిత్ కుమార్‌కు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

March 17, 2026 / 11:02 AM IST

కొండాపూర్‌లో ఉపాధి హామీ పనుల సమీక్ష

NRML: నిర్మల్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీఓ శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. పనుల నాణ్యత, కార్మికులకు వేతనాల చెల్లింపు, హాజరు నమోదు వంటి అంశాలను సమీక్షించారు. పనులు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్మికుల సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారం చేయాలని సూచించారు.

March 17, 2026 / 11:02 AM IST

పంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్టు

KNR: కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న పంచాయతీ సైదాపూర్ కార్మికులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మొలుగూరి ప్రేమ్ కుమార్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వారు మాట్లాడుతూ.. కార్మికులకు వేతనాలు పెంచాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

March 17, 2026 / 11:01 AM IST

యూట్యూబర్ వైష్ణవి హత్య.. దర్యాప్తు ముమ్మరం

JGL: కోరుట్ల మండలం మాదాపూర్‌లో యూట్యూబర్ వైష్ణవిని, భర్త హరిబాబు చంపేసిన విషయం తెలిసిందే.. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ క్షణికావేశంలో హత్యకు దారి తీసింది. వైష్ణవి ప్రస్తుతం 4 నెలల గర్భిణి కావడంతో.. భార్యకు అండగా ఉండాల్సిన భర్త ఇలాంటి దారుణానికి ఒడిగట్టడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

March 17, 2026 / 11:00 AM IST

యూట్యూబర్ హత్య.. దర్యాప్తు ముమ్మరం

JGL: కోరుట్ల మండలం మాదాపూర్‌లో యూట్యూబర్ వైష్ణవిని, భర్త హరిబాబు చంపేసిన విషయం తెలిసిందే.. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ క్షణికావేశంలో హత్యకు దారి తీసింది. వైష్ణవి ప్రస్తుతం 4 నెలల గర్భిణి కావడంతో.. భార్యకు అండగా ఉండాల్సిన భర్త ఇలాంటి దారుణానికి ఒడిగట్టడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

March 17, 2026 / 11:00 AM IST