JGL: కోరుట్ల మండలం మాదాపూర్లో యూట్యూబర్ వైష్ణవిని, భర్త హరిబాబు చంపేసిన విషయం తెలిసిందే.. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ క్షణికావేశంలో హత్యకు దారి తీసింది. వైష్ణవి ప్రస్తుతం 4 నెలల గర్భిణి కావడంతో.. భార్యకు అండగా ఉండాల్సిన భర్త ఇలాంటి దారుణానికి ఒడిగట్టడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.