ఆస్కార్ వేడుకల్లో ధర్మేంద్రకు తగిన గౌరవం దక్కలేదనే విమర్శలపై ఆయన కుమార్తె ఈషా స్పందించింది. తన తండ్రి ఎప్పుడూ గుర్తింపు కోసం ఆశపడలేదని, ఇలాంటి వేడుకలను ఆయన అస్సలు పట్టించుకోరని స్పష్టం చేసింది. హేమమాలిని సైతం స్పందిస్తూ.. ధర్మేంద్రను విస్మరించడం బాధాకరమే అయినా, కోట్లాది మంది అభిమానుల ప్రేమే ఆయనకు అసలైన అవార్డు అని పేర్కొంది.