AP PGECET-2026 నోటిఫికేషన్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు మార్చి 20లోపు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మొదట మార్చి 16 వరకు గడువు పొడిగించగా తాజాగా మరో అవకాశం ఇచ్చింది. అభ్యర్థులకు ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో ప్రవేశ పరీక్ష జరుగనుంది.