HNK: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని రాజీపేట వద్ద శివాజీ జంక్షన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ సునీల్ కుమార్ అన్నారు. రాజీపేట వద్ద శివాజీ విగ్రహ మరమ్మత్తు పనులు, జంక్షన్‌ను అధికారులతో కలిసి ఛైర్మన్ పరిశీలించారు. పరకాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు.