అకర్ణ ధనురాసనం వెన్నెముకకు, కాళ్లకు, చేతులకు అద్భుతమైన వశ్యతను ఇస్తుంది. పొత్తి కడుపుపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. వెన్నునొప్పిని తగ్గించి, ఛాతి కండరాలను బలోపేతం చేస్తుంది. ఏకాగ్రతను పెంచడం, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఛాతిని విస్తరించడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, శ్వాస ప్రక్రియను మెరుగుపరుస్తుంది.