TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణశాఖ ప్రకటించింది. రాజన్న సిరిసిల్లా, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, జగిత్యాల జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఆస్కారం ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది.