MBNR: బాలానగర్ మండలంలోని 37 గ్రామ పంచాయతీల పరిధిలో కొత్తగా పట్టా పాస్ బుక్కులు పొందిన రైతులు ‘రైతు భరోసా’ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఏవో సుజాత సూచించారు. మార్చి 25 లోపు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబర్ వివరాలతో దరఖాస్తు చేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.