PDPL: రామగిరి మండలం పన్నూర్లో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని మంగళవారం సర్పంచ్ చిందం మహేష్ ప్రారంభించారు. పశుసంవర్ధక శాఖ మండల అధికారి డా. కళ్యాణి సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆవులు, గేదెలకు టీకాలు వేసి రైతులకు అవగాహన కల్పించారు. ఈ మేరకు పశువులను వ్యాధుల నుంచి రక్షించేందుకు టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు.