• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

టీడీపీ నాయకుడు మృతి నివాళులర్పించి ఎమ్మెల్య

NDL: పగిడ్యాల మండలం లక్మాపురంకు చెందిన టీడీపీ నాయకులు బోయ శేఖర్ గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలిసిన ఎమ్మెల్య గిత్త జయసూర్య ఇవ్వాల లక్మాపురం చేరుకొని శేఖర్ మృతదేహాన్నికి పూల మాల వేసి నివాళులర్పించారు. MLA శేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ఉన్నారు.

March 17, 2026 / 09:00 PM IST

పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్సీ

CTR: కుప్పం మండలం నడుమూరు జడ్పీ హైస్కూల్‌ను ఎమ్మెల్సీ శ్రీకాంత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించిన ఆయన, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని పాఠశాల సమస్యలను ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.

March 17, 2026 / 09:00 PM IST

రేపు రాయచోటిలో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం

అన్నమయ్య: దివ్యాంగుల సంక్షేమానికి మరో కీలక అడుగుగా దివ్యాంగ శక్తి పథకాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం ఉదయం 11:30 గంటలకు RTC బస్టాండ్‌లో ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి, వారి ఆత్మగౌరవం మరియు స్వావలంబనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

March 17, 2026 / 09:00 PM IST

బైక్ దొంగ అరెస్టు.!

E.G: గోకవరం మండలంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేసినట్లు కోరుకొండ సీఐ మూర్తి మంగళవానం తెలిపారు. ఎస్సై పవన్ కుమార్ నేతృత్వంలో తనిఖీలు నిర్వహించగా, రాజవొమ్మంగి మండలం పతంగి గ్రామానికి చెందిన కాపు స్వామి రెడ్డి పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి సుమారు ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.

March 17, 2026 / 09:00 PM IST

అక్రమ గ్యాస్ రీపిల్లింగ్ ముఠా అరెస్ట్

TG: HYD బండ్లగూడలోని గోదాముల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు చేపట్టారు. అక్రమంగా గ్యాస్ రీపిల్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గ‌ృహవినియోగ సిలిండర్ల గ్యాస్‌ను వాణిజ్య సిలిండర్లలోకి నింపుతున్నట్లు గుర్తించారు. 96 డొమెస్టిక్ సిలిండర్లు, 58 వాణిజ్య సిలిండర్లు, 50 చిన్న సిలిండర్లు, గ్యాస్ రీఫిల్లింగ్ చేసే 4 యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

March 17, 2026 / 08:57 PM IST

ఇంటర్ విద్యార్థులకు పోలీసుల హెచ్చరిక

కృష్ణా: ఇంటర్ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో విద్యార్థులు క్రమశిక్షణతో పరీక్షలు రాసుకుని నేరుగా ఇళ్లకు చేరాలని ఉయ్యూరు CI రామారావు మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. అల్లరి చర్యల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం పటిష్ట నిఘా, బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టామన్నారు.

March 17, 2026 / 08:56 PM IST

‘గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి’

CTR: సుస్ధిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై సదుం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పన గ్రామం, ఈ-గవర్నెన్స్ తదితర తొమ్మిది అంశాలపై వార్డు, ఎంపీటీసీ సభ్యులకు శిక్షణ ఇచ్చినట్లు ఎంపీడీవో రాధారాణి తెలిపారు. ఈ సందర్భంగా వారు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

March 17, 2026 / 08:55 PM IST

‘డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం’

VKB: తాండూర్ యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అందరం కలిసికట్టుగా తరిమికొట్టాలని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మత్తు రహిత సమాజం కోసం కృషి చేయాలని ఆమె కోరారు.

March 17, 2026 / 08:54 PM IST

బలపాల గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం

MHBD: ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా కురవి మండలంలోని బలపాల PHCలో మంగళవారం ఉచిత మెగా మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బిక్కు నాయక్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలు ఉచిత వైద్య శిబిరం సద్వినియోపరుచుకోవాలని కోరారు. ఉప సర్పంచ్ పిట్టల వెంకన్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ తదితరులున్నారు.

March 17, 2026 / 08:54 PM IST

ఒంటిపూట బడులు..గల్లీలో పిల్లల ఆటలు..!

HYDలో బడి పిల్లలకు ఒంటిపూట బడులు ప్రారంభం కావడంతో సాయంత్రం వేళ గల్లీల్లో పిల్లల ఆటలతో సందడి అయిన వాతావరణం ఏర్పడుతోంది. పిల్లల సందడిని చూసిన పెద్దలు, వారి చిన్ననాటి స్కూల్ డేస్ గుర్తు చేసుకుని పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు. సాయంత్రం వేళ ఉప్పల్, నాచారం, చిల్కానగర్ గల్లీలో పిల్లా పెద్దలు కలిసి చల్లటి వాతావరణం ఆస్వాదిస్తూ ఆటలాడారు.

March 17, 2026 / 08:53 PM IST

గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

BHNG: పంతంగి టోల్‌గేట్ వద్ద ఎక్సైజ్ అధికారులు ఇవాళ నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ. 25 లక్షల విలువైన 60.685 కిలోల గంజాయి పట్టుబడింది. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన ముగ్గురు, నల్గొండకు చెందిన ఒకరిని అరెస్ట్ చేశారు. నిందితులు భరంపూర్ నుంచి HYD మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా రామన్నపేట, మోత్కూర్ ఎక్సైజ్ బృందాలు పట్టుకున్నాయి.

March 17, 2026 / 08:52 PM IST

దోమల నివారణకు పటిష్ట చర్యలు

MBNR: కౌకుంట్ల మండలం వెంకటగిరిలో దోమల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ లక్ష్మయ్య తెలిపారు. ఈ మేరకు దోమల నియంత్రణకు గ్రామంలోని వీధుల్లో ఫాగింగ్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ , కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

March 17, 2026 / 08:50 PM IST

‘మతసామరస్యాన్ని ప్రతీక రంజాన్ ఇఫ్తార్ విందు’

SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని జుమా మసీదులో మంగళవారం సాయంత్రం ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. స్థానిక సర్పంచ్ శ్రీనివాస రావు పాటిల్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు కలిసి ముస్లిం సోదరులకు పండ్లు ఫలాలు తినిపించి రోజా ఉపవాస దీక్షను విరమింపజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ మాసం అని పేర్కొన్నారు. వార్డు సభ్యులు ఉన్నారు.

March 17, 2026 / 08:50 PM IST

ఉగాది పంచాంగం చెబుతాం అంటూ FAKE లింకులు

HYD: ఉగాది పంచాంగం చెబుతాం అంటూ గుర్తుతెలియని వ్యక్తులు కొందరికి మెసేజెస్ చేస్తున్నారు. ఉప్పల్, నాచారం ప్రాంతాల వారిలో కొందరికి వచ్చినట్లు తెలిపారు. దీనిపై మల్కాజిగిరి పోలీసులను వివరణ కోరగా.. లింకులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వీటిలో చాలా వరకు నకిలీ లింకులే. పంచాంగం పేరుతో వ్యక్తిగత వివరాలు, OTPలు, బ్యాంక్ సమాచారం దొంగిలించే ప్రయత్నాలు చేస్తారు అని తెలిపారు.

March 17, 2026 / 08:50 PM IST

ALERT: గడువు పెంపు

ఏపీ EAPCET-2026 దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకూ పొడిగించినట్లు సెట్ కన్వీనర్ మోహనరావు తెలిపారు. రూ.1,000 ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకు, రూ.2 వేల రుసుముతో  ఏప్రిల్‌ 1 వరకు, రూ.4 వేల రుసుముతో  ఏప్రిల్‌ 6 వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 10 వరకు గడువు ఉందని వివరించారు. తప్పుల సవరణకు ఏప్రిల్‌ 11 నుంచి 13 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

March 17, 2026 / 08:49 PM IST