BHNG: పంతంగి టోల్గేట్ వద్ద ఎక్సైజ్ అధికారులు ఇవాళ నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ. 25 లక్షల విలువైన 60.685 కిలోల గంజాయి పట్టుబడింది. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన ముగ్గురు, నల్గొండకు చెందిన ఒకరిని అరెస్ట్ చేశారు. నిందితులు భరంపూర్ నుంచి HYD మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా రామన్నపేట, మోత్కూర్ ఎక్సైజ్ బృందాలు పట్టుకున్నాయి.