CTR: 2030వ సంవత్సరం నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రజా ప్రతినిధులు సహకరించాలని వెదురుకుప్పం ఎంపీడీవో పురుషోత్తం సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీలు, వార్డు సభ్యులకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030 కార్యక్రమంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం మంగళవారం జరిగింది. జీవనోపాధి కల్పించి పేదరహిత గ్రామాలుగా మార్చేందుకు సహకరించాలన్నారు.