AP: మద్యం కుంభకోణం కేసులో ఏ-7గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి రెండోరోజు విచారణ పూర్తయింది. విజయవాడ GGHలో వైద్యపరీక్షల అనంతరం పోలీసులు ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. రేపు కూడా సిట్ అధికారులు ఆయనను మరోసారి ప్రశ్నించనున్నారు. ఈ విచారణలో మద్యం అక్రమాలకు సంబంధించి కీలక ఆధారాలను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం.