SRPT: హుజూర్ నగర్లోని రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన 2,160 ఇందిరమ్మ ఇళ్లను త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మంగళవారం ఆయన కాలనీలోని రోడ్లు, హెలిప్యాడ్, సభాస్థలి పనులను పరిశీలించి, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని ఆయన అన్నారు.