SRD: నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సబ్ కలెక్టర్ ఉమా హారతితో కలిసి కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడికి వచ్చిన రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓపి రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.