RR: షాద్నగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీలో గల ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలిచిన నీటితో చిన్నారులు తరగతులకు వెళ్లడం కష్టంగా మారింది. పాఠశాల చుట్టూ సరైన కాలువ వ్యవస్థ లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు సంబంధించిన అధికారులు స్పందించాలని కోరారు.