TG: అసెంబ్లీలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై వాడీవేడి చర్చ జరుగుతోంది. మొదటి దశ అంచనా వ్యయం రూ.7వేల కోట్లు అని, 1,438 నిర్మాణాలు ప్రభావితమవుతాయని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. మెయిన్‌హార్ట్ కంపెనీకి DPR కాంట్రాక్ట్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. గతంలో 18 నెలలు పడుతుందన్న DPR, ఇంత తక్కువ కాలంలో ఎలా తయారైందని ప్రశ్నించారు.
VKB: పూడూరు మండలం నిజాంపేట్ మేడిపల్లి గ్రామంలో భారీ వర్షాలు విషాదాన్ని నింపాయి. మంగళవారం అర్ధరాత్రి మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. ఈ రాళ్ల వాన ధాటికి వలస వచ్చిన కాపరుల 150 మేకలు మృత్యువాత పడ్డాయి. మేకలు చనిపోవడంతో జీవనాధారం కోల్పోయామని, ప్రభుత్వం తమని ఆదుకోవాలని కాపరులు కోరుతున్నారు.
MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని కంటాయపాలెం రోడ్డు (ఛాంబర్ కామర్స్ భవనం) ఎదుట కాలనీకి వెళ్లే రోడ్డులో డ్రైనేజీ లేక మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. దీంతో దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి పరిసరాలను కలుషితం చేయడంతో దుర్వాసన వస్తుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పలుమార్లు మున్సిపల్ సిబ్బందికి తెలిపినప్పటికీ పట్టించుకోవట్లేదన్నారు.
కోనసీమ: అల్లవరం మండలం గోడిలంక గ్రామంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన కాశీ నాగరాజు (55) సైకిల్‌పై వెళుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం: పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఎవరు గుంపులుగా ఉండరాదని అర్ధవీడు ఎస్సై శివనాంచారయ్య తెలిపారు. బుధవారం అర్ధవీడులోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.
కాకినాడ: డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా బుధవారం సామర్లకోట రైల్వే స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. నిర్మిత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. స్టేషన్ మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో అధికారులు డీఆర్ఏంకు ఘన స్వాగతం పలికారు.
BDK: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ శాసనసభ ఆవరణంలో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరయ్యారు. ఈ సభలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రాధాన్యతలపై ఈ సమావేశంలో చర్చించినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు.
SDPT: నంగునూరు మండలంలో అకాల వర్షాలు, ఈదురు గాలులు మామిడి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వాతావరణ మార్పులతో ఇప్పటికే పూత రాలిపోగా, తాజా గాలివానకు పిందెలు నేలరాలాయి.ఈసారి ఉగాది పండుగ ముందుగా రావడంతో కాయల సైజు కూడా పెరగలేదు. స్థానిక తోటల్లో పంట దెబ్బతినడంతో, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే మామిడి కాయలతోనే ఉగాది పచ్చడి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాలం మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న ఓ భవనంలో మంటలు చెలరేగాయి. అందులో పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భవనంలో కమర్షియల్, రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉన్నాయి. ఘటనాస్థలానికి ఫైరింజన్లు, అంబులెన్సులు చేరుకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRD: నారాయణఖేడ్ పట్టణంలోని బస్తీ దవాఖానను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలోని హాజరు, మందుల రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం రోగులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు.
VZM: రాజాం రూరల్ సీఐగా పనిచేస్తున్న ఉపేంద్రను జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదరన్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రశంస పత్రం, ప్రోత్సాహక నగదు ప్రదానం చేశారు. ఇటీవలె రాజాం పట్టణంలో జరిగిన భారీ దొంగతనానికి సంబంధించి మధ్య ప్రదేశ్ వెళ్లి కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించారన్నారు.
NTR: పవిత్ర సంగమం వెళ్లే రహదారిలోని ఇబ్రహీంపట్నం ఆర్టీసీ కాలనీలో మంచినీటి పైప్ లైన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా రక్షిత మంచినీరు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా మున్సిపల్ అధికారులు ఈ పనులను వేగవంతం చేశారు. భూగర్భ పైపుల ఏర్పాటు పనులను అధికారులు నిశితంగా పర్య వేక్షిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే మంచినీటి కష్టాలు శాశ్వతంగా తొలగనున్నాయి.
ADB: గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతులకు పోషకాహార భద్రత కల్పించే లక్ష్యంతో ఉచిత కూరగాయల మినీ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నేరడిగొండలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోథ్ బ్లాక్ ఆత్మ (ATMA) ఛైర్మన్ గొర్ల రాజు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు కూరగాయల కిట్లను పంపిణీ చేశారు. ప్రజలు స్వయంగా కూరగాయలు సాగు చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
AP: దివ్యాంగ శక్తి పథకం అమలుకు శ్రీకారం చుట్టిన సీఎంకు మంత్రి DSBV స్వామి ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం ద్వారా 12.76 లక్షల మంది దివ్యాంగులు, సహాయకులకు లబ్ధి చేకూరనుంది. దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేస్తున్నామని అన్నారు. విశాఖలో రూ.200 కోట్లతో అత్యాధునిక పారా స్పోర్ట్స్ కాంప్లెక్స్, దివ్యాంగులకు రుణ రాయితీ పథకాన్ని పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.
TPT: చంద్రగిరి మాజీ MLA, తోడబుట్టిన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు జయంతి సందర్భంగా ఆయనకు CM చంద్రబాబు నివాళులర్పించారు. ‘చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తిత్వం రామ్మూర్తి నాయుడు సొంతం. భౌతికంగా మాకు దూరమైనా.. మా మనసుల్లో మరిచిపోలేని జ్ఞాపకంగా ఎప్పటికి ఉంటాడు’అంటూ ఆయన ‘X’లో రాసుకొచ్చారు.