• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఆకివీడులో శాంతి కమిటీ వేయండి’

W.G: ఆకివీడు పెదపేట గుడి వివాదంలో రాజకీయ నాయకులు ఏకపక్షంగా వ్యవహరించకూడదని CPM ఏరియా కమిటీ కోరింది. ఇరు వర్గాలను సమన్వయ పరుస్తూ మతసామరస్యం పెంపొందించాలని బుధవారం ఏరియా కార్యదర్శి కె. తవిటి నాయుడు సూచించారు. వివాద పరిష్కారానికి శాంతి కమిటీ వేయాలని, ఎవరూ రెచ్చగొట్టే ధోరణిలో ప్రయత్నించవద్దని కోరారు.

March 18, 2026 / 11:38 AM IST

బరువు తగ్గాలంటే.. మార్పులు తప్పనిసరి!

బరువు తగ్గాలంటే జీవనశైలిలో చిన్న మార్పులు తప్పనిసరి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం లేదా నడక అలవాటు చేసుకోండి. జంక్ ఫుడ్, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. రోజుకు 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది. రాత్రి భోజనం నిద్రకు రెండు గంటల ముందే ముగించాలి. క్రమశిక్షణతో కూడిన ఆహారం, తగినంత నిద్ర ముఖ్యం.

March 18, 2026 / 11:38 AM IST

కట్ర్యాలలో ఉచిత ఆరోగ్య శిబిరం

WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో డాక్టర్ ఆకారపు రాజగోపాల్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరంలో 156 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిబిరంలో రక్తపోటు, షుగర్, సాధారణ జ్వరాలు, శ్వాసకోశ సమస్యలు వంటి అనేక వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

March 18, 2026 / 11:37 AM IST

కమిషనరేట్ పరిధిలో 110 డ్రంక్ &డ్రైవ్ కేసులు

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం రాత్రి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 110 మంది వ్యక్తులు మద్యం తాగి పట్టుబడ్డారు. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 42 మంది, వెస్ట్ జోన్‌లో 26 మంది, సెంట్రల్ జోన్‌లో 23 మంది, ఈస్ట్ జోన్‌లో 19 మంది కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు.

March 18, 2026 / 11:35 AM IST

కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇక సులభం

KMM: కొత్త విద్యుత్ కనెక్షన్‌లు ప్రక్రియను సరళతరం చేస్తూ ఖమ్మం ఎస్ఈ శ్రీనివాసాచారి నూతన సర్వీస్ లైన్ ఛార్జీల విధానాన్ని ప్రకటించారు. ఇకపై క్షేత్రస్థాయి పరిశీలన అవసరం లేకుండా కేవలం లోడ్ ఆధారంగానే ఏకరీతి ఛార్జీలు వసూలు చేయనున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఖర్చును విద్యుత్ సంస్థే భరిస్తుందని, దీంతో వినియోగదారులపై అదనపు భారం ఉండదన్నారు.

March 18, 2026 / 11:35 AM IST

‘BRS పనులు వరదకు కొట్టుకుపోయాయి’

TG: బీఆర్‌ఎస్ హయాంలో ఎస్టీపీ పనులు కేవలం 30 శాతమే జరిగాయని, మిగిలిన 70 శాతం పనులు తమ హయాంలోనే పూర్తయ్యాయని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన పనులు చిన్న వరదకే కొట్టుకుపోయాయని విమర్శించారు. తాము ప్రాజెక్టులను ఆపేశామని చెప్పడం సరికాదన్నారు. మురికి కాలువగా మారిన మూసీని జీవనదిగా మారుస్తుంటే బీఆర్‌ఎస్ ఎందుకు అడ్డుపడుతోందని ఆయన ప్రశ్నించారు.

March 18, 2026 / 11:34 AM IST

పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

GDWL: జిల్లా కేంద్రంలోని సరస్వతి టాలెంట్ హైస్కూల్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాసరావు సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా సెక్షన్ 163 అమలులో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిరాక్స్ కేంద్రాలను మూసివేయించి, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

March 18, 2026 / 11:33 AM IST

సరిపడా ఎరువులను అందించాలి: MLC

MHBD: రైతులకు సరిపడా ఎరువులను అందించాలని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. శాసనమండలిలో నేడు ఆయన మాట్లాడుతూ.. ఎరువుల బుకింగ్ కు యాప్ ద్వారా వచ్చే సమస్యను పూర్తిగా పరిష్కరించాలని, పంటలకు ధర ఏకీకృతంగా ఉండాలని అన్నారు. ఎరువుల పంపిణీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు.

March 18, 2026 / 11:33 AM IST

నూతన SIను సన్మానించిన కాంగ్రెస్ నేతలు

BHPL: గోరికొత్తపల్లి (M) నూతన SIగా బాధ్యతలు చేపట్టిన సాయి నాథ్ త్రిలోక్ నాథ్ రెడ్డిను ఇవాళ నిజాంపల్లి గ్రామ కాంగ్రెస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. SIను శాలువతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు మధుకర్, మాజీ MPTC రాంబాబు, వార్డు మెంబర్లు సురేష్, దేవేందర్, యూత్ అధ్యక్షుడు నరేష్, శ్రీనివాస్, అశోక్ ఉన్నారు.

March 18, 2026 / 11:32 AM IST

రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోండి: AO

WGL: నెక్కొండ (M) కేంద్రంలోని అర్హత గల రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగరాజు తెలిపారు. 2026 FEB 28 లోపు కొత్త పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు ఈ నెల 22 లోపు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ జిరాక్స్‌లతో స్థానిక AEOలను సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు AO కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

March 18, 2026 / 11:31 AM IST

నేడు శ్రీకాకుళంలో ఇఫ్తార్ విందు

SKLM: రంజాన్ పండుగను పురస్కరించుకుని ఇవాళ నగరంలో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి షైక్ మహబూబ్ షరీఫ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ రోడ్డులోని శశి కన్వెన్షన్ హాల్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు .

March 18, 2026 / 11:31 AM IST

‘ప్రతి ఇంటా సిరి సంతోషాలు వెల్లివిరియాలి’

VZM: తెలుగు వారి కొత్త సంవత్సరాధి ‘శ్రీ పరాభవ నామం’లో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మాదిరి జీవితంలోని కష్టసుఖాల సమ్మేళనానికి ప్రతీకలని, ప్రజలందరూ ధైర్యంతో, ఉత్సాహంతో కొత్త ఏడాదిలో అడుగుపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

March 18, 2026 / 11:29 AM IST

పశు వైద్యశాల.. సమస్యల గోల..!

KDP: ఖాజీపేట(M) ఆంజనేయ కొట్టాల గ్రామంలోని పశు వైద్యశాలలో సమస్యలు వేధిస్తున్నాయి. ఈ ఆసుపత్రి ఇరుకుగా ఉండటంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. మరుగుదొడ్డి, మంచినీరు వంటి కనీస సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించాలని, ఆసుపత్రికి వచ్చే పాడి రైతులు ఉన్నత అధికారులను కోరుతున్నారు.

March 18, 2026 / 11:29 AM IST

ఇంటర్మీడియట్ పరీక్షలు.. 333 మంది గైర్హాజరు

TPT: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పేపర్-2 పరీక్ష జరుగుతుంది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 84 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 24,332 మంది విద్యార్థులకు గాను 23,999 మంది విద్యార్థులు హాజరైనట్లు రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 333 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు అధికారులు తెలియజేశారు.

March 18, 2026 / 11:29 AM IST

‘మూసీని నగరానికి మణిహారంగా మారుస్తాం’

TG: మూసీ పరివాహక ప్రజలు తీవ్ర అపరిశుభ్ర వాతావరణంలో జీవిస్తున్నారని, వారి బతుకులు మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో తెలిపారు. మూసీని నగరానికి మణిహారంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షం ఎందుకు అడ్డుపడుతోందని ప్రశ్నించారు. పేదల జీవనగతులు మార్చే గొప్ప ప్రాజెక్టును రాజకీయాల కోసం వ్యతిరేకించడం సరికాదని ఆయన హితవు పలికారు.

March 18, 2026 / 11:28 AM IST