SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో బుధవారం అమావాస్య సందర్భంగా పూర్ణాహుతి ప్రత్యేక హోమం నిర్వహించారు. ఆలయ ఈవో శశిధర్ ఆధ్వర్యంలో బీద పండితుల సమక్షంలో జరిగిన ఈ హోమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ASF: ఆసిఫాబాద్ నుంచి గుండి గ్రామానికి వెళ్లే లింకేజీ రోడ్డు దయనీయంగా తయారైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డంతా గుంతలమయంగా మారి ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆవేదన చెందారు. వర్షాకాలంలో బురద కారణంగా వాహనాలు నడపడం ప్రాణసంకటంగా మారుతోందని బుధవారం రోడ్డుపై నిలబడి నిరసన తెలిపారు. అధికారులు స్పందించి కొత్త రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు.
TG: డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కేవలం నిజమైన జర్నలిస్టులకే అక్రిడిటేషన్ కార్డులు అందాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, కోర్టుల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా పంపిణీ చేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
AP: కృష్ణా జిల్లా యనమలకుదురులో పడమట పీఎస్ ఏఎస్ఐ వీరవల్లి గోపి వెంకట దుర్గాప్రసాద్ మృతదేహం లభ్యమైంది. ఒక కేసు విషయంలో 15 రోజుల క్రితమే ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. తాజాగా ఆయన విగతజీవిగా కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
సత్యసాయి: కొత్తచెరువు మండలం పోతులకుంట, మరువకుంటపల్లి గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘రైతన్న మీకోసం’ వారోత్సవాలను నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు.
ADB: ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈగల్ ఫోర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. విద్యార్థులతో కలిసి నిర్వహించిన భారీ ర్యాలీలో ‘సే నో టూ డ్రగ్స్’ అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈగల్ ఫోర్స్ డీఎస్పీ భిక్షపతి మాట్లాడుతూ.. యువత మత్తుకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ATP: అనంతపురం అంబేద్కర్ ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. హజ్ యాత్రికులకు లక్ష రూపాయల సాయం, హజ్ హౌస్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ముస్లిం సోదరుల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
ELR: ఉంగుటూరు (M) కైకరం సుందర సీతారామస్వామి కళింగ రామాలయంలో భక్తులు సమకూర్చిన రూ. 5 లక్షలపైగా విరాళాలతో రూపొందించిన ఆష్ట భుజి టేకు రథం ఈనెల 21న సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయ కర్త కూన అప్పారావు బుధవారం తెలిపారు. కర్ణాటకలోని కుంట పట్నానికి చెందిన కుంట హస్త కళా సంస్థ ఈ దివ్య రథ నిర్మాణం చేశారని పేర్కొన్నారు.
CTR: ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన సదుం మండలంలో ఇవాళ వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం మేరకు.. కంభం వారి పల్లి పంచాయతీ గాండ్ల పల్లెకు చెందిన మోహన్ బాబు (26) వ్యవసాయ పొలాల వద్ద మోటర్ మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు నిన్న సాయంత్రం బావిలోపడ్డాడు. ఇవాళ అతని మృతదేహాన్ని గుర్తించి స్థానికులు వెలికి తీశారు.
MDK: మెదక్ నుంచి సుమారు 80 మంది ప్రయాణికులతో బొడ్మట్‌పల్లి వెళ్తున్న RTC బస్సుకు టేక్మాల్ వద్ద త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణంలో ఒక్కసారిగా ముందు టైరు పగిలిపోవడంతో డ్రైవర్ అప్రమత్తంగా స్పందించి వాహనాన్ని సురక్షితంగా నిలిపివేశారు. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. అయితే సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
MBNR: జడ్చర్ల మండలంలోని 8 కేంద్రాల్లో బుధవారం జరిగిన పదో తరగతి హిందీ పరీక్షకు ఇద్దరు విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1,826 మంది విద్యార్థులకుగాను 1,824 మంది హాజరైనట్లు ఎంఈవో మంజులాదేవి తెలిపారు. పరీక్షల్లో విద్యార్థులు ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని, పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
BDK: పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో మణుగూరులోని పరీక్ష కేంద్రాలను ఇవాళ డీఎస్పీ రవీంద్ర రెడ్డి, సీఐ నాగబాబు పరిశీలించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని డీఎస్పీ సూచించారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
MNCL: జన్నారం మండలంలోని మందపల్లి రేండ్లగూడలో నిర్వహించే పశువుల సంత వేలంపాటను వాయిదా వేశామని గ్రామ సర్పంచ్ అల్లం మాధవి-రవి, కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రేండ్లగూడ పంచాయతీ కార్యాలయంలో పశువుల వారసంత వేలం పాటను నిర్వహించారు. అయితే సరైన డిపాజిట్ రాకపోవడంతో వేలంపాటను శుక్రవారానికి వాయిదా వేశామన్నారు. ఈ మేరకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ పాయింట్ పేలి మంటలు చెలరేగిన ఘటనలో ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ పాయింట్ పేలి మంటలు చెలరేగిన ఘటనలో ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.