NLR: వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్డు, మంచినీటి ట్యాంక్‌ను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. వైసీపీ హయంలో ట్యాంక్ ఏర్పాటు చేశారు గానీ అందుకు కావలసిన మెట్లను కట్టకపోవడం ఆశ్చర్యం కలిగించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
GNTR: ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ఆయన ప్రయాణించి పథకంపై అవగాహన కల్పించారు. ఈ సౌకర్యం ద్వారా దివ్యాంగులు అవసరాల కోసం సులభంగా ప్రయాణించగలుగుతారని పేర్కొన్నారు.
VZM: విభిన్న ప్రతిభావంతులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని స్థానిక RTC ఆవరణలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ సేధు మాధవన్, ఎమ్మెల్యే అధితి గజపతిరాజు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
PPM: ప్రతి కుటుంబంలో ఒకరు వ్యాపారవత్తగా తయారయ్యి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఇంఛార్జ్ డీఆర్డీఏ పీడీ వైశాలి అన్నారు. బుధవారం జియ్యమ్మవలస మండలం పెదమేరంగి గ్రామంలో మహిళా సంఘాలు సభ్యులు వివిధ పథకాలలో తీసుకొన్న రుణాలు ఏ విధంగా వినియోగిస్తున్నారు అనేది పరిశీలించారు. అనంతరం పాన్ షాప్ నిర్వహిస్తున్న మహిళతో మాట్లాడారు.
W.G: పెనుమంట్ర MRO కార్యాలయం వద్ద బుధవారం సెక్రటరీలు, VROలు, సర్వేయర్లతో తహశీల్దార్ రవికుమార్ సమీక్ష నిర్వహించారు. జనగణన – 2027 ఫేజ్-1కు సంబంధించి హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ మ్యాపింగ్, ల్యాండ్ మార్క్ గుర్తింపుపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మ్యాపులు గీసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సమావేశంలో ASO అశోక్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు
GDWL: నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో సీట్లు సాధించిన జిల్లాకు చెందిన 16 మంది విద్యార్థులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. గతంలో వెనుకబడిన గద్వాల నియోజకవర్గం, ప్రస్తుతం అక్షరాస్యతలో మెరుగైన ఫలితాలు సాధిస్తుండటం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ప్రకాశం: దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు, తాళ్ళూరు మండలాల్లో జేసీ కల్పనకుమారి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా లే అవుట్ అప్రూవల్ నిమిత్తం పెండింగ్‌లో ఉన్న పలు సర్వే నెంబర్లను జేసీ కల్పనకుమారి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భవనాలకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. జేసీ వెంట అద్దంకి ఆర్డీవో, ఇతర మండలాల ఎమ్మార్వోలు, సర్వేయర్లు ఉన్నారు.
GDWL: జిల్లా కేంద్రంలో బుధవారం అసాధారణ రీతిలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధాన రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరడంతో అటు పాదచారులు, ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండ తీవ్రతకు తోడు ట్రాఫిక్ స్తంభించడంతో అత్యవసర పనులపై వెళ్లేవారు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు.
CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11.57 నుంచి 12.46 వరకు అభిజిత్ లగ్నంలో కార్యక్రమం జరుగుతుందన్నారు. భక్తులు ముందుగా పేర్లను నమోదు చేసుకుని రూ.300 టికెట్ తీసుకోవాలని ఈవో పెంచల కిశోర్ సూచించారు.
SDPT: సిద్దిపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో మంజూరైన రోడ్లు అర్థాంతరంగా ఆగిపోయి గుంతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడారు. రెండు ఏళ్లుగా సిద్దిపేట ఆర్అండ్‌బీ శాఖని ఇంఛార్జ్ అధికారులతో నడిపిస్తున్నారని, దయచేసి వెంటనే ఖాళీగా ఉన్న పోస్టుల నియామకం చేపట్టాలని కోరారు.
SDPT: అక్కన్నపేట మండలం గండిపల్లిలో గురువారం రంజాన్ పండుగ పురస్కరించుకొని ముస్లిం సోదర, సోదరీమణులకు దుస్తులు పంపిణీ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు సర్పంచ్ బంధారం శ్రీనివాస్, ఉప సర్పంచ్ గణేష్ లబ్ధిదారులకు వీటిని అందజేశారు. పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్య దర్శి సంపత్, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు.
TG: మూసీ పునర్నిర్మాణ ప్రాజెక్టును బీఆర్ఎస్ అడ్డుకుంటోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. పేదలకు నష్టం జరగకుండా మూసీ ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. మూసీలో మురుగు నీరు కలవకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్‌లా ప్రచార ఆర్భాటం కోసం ప్రాజెక్టు చేపట్టలేదని విమర్శించారు.
సత్యసాయి: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన వనరుల స్థాపన కోసం కేటాయించిన భూముల పురోగతిపై జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్షించారు. ఏపీఐఐసీ, నెడ్‌క్యాప్ సంస్థలకు నిర్దేశించిన గడువులోగా భూములను అప్పగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూసేకరణలోని అడ్డంకులు తొలగించి, సరిహద్దుల గుర్తింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
CTR: విజయపురం గ్రామంలో మూడో విడత ‘అన్నదాతా సుఖీభవ’ కార్యక్రమం భాగంగా రైతులకు ఫాంప్లెట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రైతులకు అందిస్తున్న సహాయంపై అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను మై టీడీపీ యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.
ATP: తాడిపత్రిలో విషాదం నెలకొంది. లక్ష్మీ ప్రసన్న (30) అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు 20 రోజుల క్రితమే కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాకు చెందిన విజయ్ కుమార్‌తో వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజులకే ఈ ఘోరానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం రేపింది. లక్ష్మీ ప్రసన్న డిప్రెషన్‌తోనే బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.