భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్(IIFCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 37 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియను పలు దశలుగా నిర్వహించనున్నారు.
ATP: రాయదుర్గం పట్టణంపై కోట వద్ద ఉన్న భక్త కన్నప్ప ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను విద్యార్థులను అడిగారు.
KMR: పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న HPV వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను రాష్ట్ర వైద్య శాఖ పరిశీలకులు బుధవారం సందర్శించారు. ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు వేసిన టీకాలపై ఆరా తీశారు. రికార్డులను సైతం పరిశీలించారు. HPV టీకాలపై బాలికలకు విస్తృత అవగాహన కల్పించేందుకు పాఠశాలలోని యాజమాన్యాలను కలిసి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.
VSP: జిల్లాలోని వివిధ వసతి గృహాలకు చెందిన దివ్యాంగ చిన్నారులతో కలిసి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆత్మీయ విందు నిర్వహించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులతో కలిసి భోజనం చేస్తూ వారితో ఆప్యాయంగా ముచ్చటించారు.
JN: రాష్ట్రవ్యాప్తంగా మొక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. శాసనసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రస్తుతం మొక్కజొన్న పంట కోత దశకు చేరుకుందని, వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
SKLM: పొందూరులో శ్రీ పైడితల్లి అమ్మవారి వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరారు.
AP: రాష్ట్ర రాజధాని అమరావతిలో అకాల వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. ఈ క్రమంలో తుళ్లూరులో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు. కాగా ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
WNP: మదనాపురం మండలం దంతనూరు గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణయ్య అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిన్న ప్రజావాణిలో ఉండడంవల్ల రాలేకపోయానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృష్ణయ్య చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.
MLG: తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా MLG జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర మంత్రి సీతక్క ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని, జిల్లా అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
PDPL: రామగుండం సింగరేణి సంస్థ GDK-11వ బొగ్గు గనిలో ఖాళీగా ఉన్న టైం రేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని గుర్తింపు కార్మిక సంఘం (AITUC) నాయకులు గని మేనేజర్ మల్లేశంకు వినతి పత్రం ఇచ్చారు. నాయకులు నాయిని శంకర్ మాట్లాడుతూ.. యాజమాన్యం ముందుగా అంగీకరించి, తర్వాత నిర్లక్ష్యం చేస్తుందన్నారు. త్వరగా నోటీస్ బోర్డు ద్వారా ప్రకటించి ఖాళీలను భర్తీ చేయాలన్నారు.
VZM: నూతన సంవత్సర ఉగాది ప్రతి ఇంట్లో సిరిసంపదలతో పాటు సుఖశాంతులు నింపాలని మంత్రి శ్రీనివాస్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ అని ఆయన తెలిపారు.
SKLM: దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కలెక్టరేట్‌లో దివ్యాంగులతో బుధవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతి దివ్యాంగునితో మాట్లాడి వారి ఉపాధి, పని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
AKP: నక్కపల్లి మండలంలో నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన తగ్గదని సీపీఎం జిల్లా కమిటీ తీర్మానించింది. బుధవారం అనకాపల్లి సీపీఎం కార్యాలయంలో పార్టీ సమావేశం జరిగింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కోసం సేకరించిన భూములకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలన్నారు.
అన్నమయ్య: మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగియడంతో జేసీ మధుసూదన్ రావును మదనపల్లి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా నియమించారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించి, మౌలిక సేవలు అంతరాయం లేకుండా కొనసాగిస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
WNP: అదుపుతప్పి కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటన పెబ్బేరు మండలం 44 జాతీయ రహదారిపై ఇవాళ చోటుచేసుకుంది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న SI యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రమాదంలో డ్రైవర్ కారు అద్దాలు పగలగొట్టి క్షేమంగా బయటకు వచ్చాడన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.