• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇప్పటికే 6.6 లక్షల ఉద్యోగాలిచ్చాం: CBN

AP: ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వంలో మెగా DSCపైనే తన తొలి సంతకం చేశానని CM చంద్రబాబు గుర్తుచేశారు. ఆపై కానిస్టేబుల్ పోస్టుల భర్తీ తదితరాలతో కలిపి ఇప్పటివరకు 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని.. ఇప్పటివరకు 6,28,000 మంది ప్రైవేట్ జాబ్స్ పొందారన్నారు.

March 19, 2026 / 11:30 AM IST

నందిగామలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఎన్టీఆర్: నందిగామ పరిధిలోని గాంధీ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. రానున్న వేసవి నేపథ్యంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన వారిని ఎమ్మెల్యే సౌమ్య అభినందించారు.

March 19, 2026 / 11:27 AM IST

నవోదయ ఫలితాల్లో విద్యార్థి సత్తా

VSP: పద్మనాభ మండలం పొట్నూరు గ్రామానికి చెందిన అవునాపు ఆశీష్ బుధవారం విడుదలైన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటాడు. 100 మార్కులకు గాను 97.5 మార్కులుతో ఆల్ ఇండియా 6వ ర్యాంక్ సాధించినట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు. విద్యార్థి ప్రతిభను గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు.

March 19, 2026 / 11:25 AM IST

అప్పుల బాధతో ఒక వ్యక్తి ఆత్మహత్య

MDK: అప్పుల బాధ తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలానికి చెందిన పంజ సత్తయ్య (48) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తనకున్న భూమిని అమ్మి ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేశాడు. అనంతరం కొత్త ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులో 5 లక్షలు, బయట వ్యక్తుల వద్ద 10 లక్షల అప్పు చేశాడు.

March 19, 2026 / 11:25 AM IST

కుప్పకూలిన మార్కెట్లు.. రేపు ఫుల్ లాభాలంటూ ఎర..!

MDCL: నేడు స్టాక్ మార్కెట్‌లో కుప్పకూలిన నేపథ్యంలో రేపు భారీ లాభాలు అర్జించే అవకాశం ఉంటుందని పలువురు ఫేక్ ఇన్వెస్టర్లు ఉప్పల్, నాచారం ప్రాంతాలకు చెందిన ట్రేడర్లకు కాల్స్, మెసేజెస్ చేస్తున్నట్లుగా తెలిపారు. అలాంటి మెసేజెస్ నమ్మితే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని, వాటికి దూరంగా ఉండటం మేలని సైబర్ పోలీస్ అధికారులు తెలిపారు.

March 19, 2026 / 11:22 AM IST

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్, ఎస్పీ

వనపర్తి జిల్లా ప్రజలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారంతో తయారు చేసిన ఉగాది పచ్చడిలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాసుఖాలు, ఆనందం బాధలన్నింటికీ ఉగాది పచ్చడి ప్రతీక అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

March 19, 2026 / 11:20 AM IST

బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం

TG: శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయం తరపున మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. ఆహ్వానించిన వారిలో దేవాదాయశాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఈవో ఉన్నారు. కాగా, ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 27న సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం జరగనుంది.

March 19, 2026 / 11:20 AM IST

పోచంపల్లిలో ఉగాది వేల ధరలు పెరుగుదల…

BHNG: పోచంపల్లిలో ఉగాది సందడి నెలకొంది. మార్కెట్లో కుండలు, మామిడాకులు, మామిడికాయలు, వేపాకు వేప పువ్వు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.. పెరిగిన ధరలతో పండుగ కొనుగోళ్ల భారంగా మారాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు మాత్రం అమ్మకాలు బాగున్నాయి చెబుతున్నారు.

March 19, 2026 / 11:19 AM IST

కూటమి పాలనలో యువతకు ప్రాధాన్యం: CBN

AP: భవిష్యత్ అంతా యువతపైనే ఆధారపడి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. అలాంటి యువత ఎప్పటికప్పుడు శక్తిమంతమైన ఆలోచన చేయడంతో పాటు దాన్ని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించాలని, అందుకోసం కూటమి ప్రభుత్వం వారికి అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ఇవాళే 10 వేల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇచ్చామని, ప్రతి ఏటా ఉగాది పర్వదినాన కాలెండర్లు వస్తాయని పునరుద్ఘాటించారు. 

March 19, 2026 / 11:18 AM IST

ఈనెల 22 నుంచి రైతు భరోసా నిధులు జమ

KMM: ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో యాసంగి రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున తొలుత చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యతనిస్తూ నిధులు విడుదల కానున్నాయి. ఖమ్మం జిల్లాలో రూ. 3.58 లక్షల మంది రైతులకు రూ. 440.63 కోట్లు, కొత్తగూడెం జిల్లాలో రూ. 1.91 లక్షల మందికి రూ. 353.78 కోట్లు అందనున్నాయి.

March 19, 2026 / 11:17 AM IST

ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: మాజీ ఎమ్మెల్యే

NDL: బనగానపల్లె నియోజకవర్గ ప్రజలకు ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. పరాభవ నామ సంవత్సరమున ఉగాది పండుగను ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకోవాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. ఉగాది అంటే తెలుగు ప్రజలకు పెద్ద పండగన్నారు. ఈ సంవత్సరం ప్రజలకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

March 19, 2026 / 11:16 AM IST

నీటికుంటల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలో కరువు నివారణకు పంట పొలాలలో నీటి కుంటలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం 50 కోట్లు వెచ్చించనుంది. ఈ మూడు జిల్లాలలో మొత్తం 100 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయగా మొదటి విడతగా 50 కోట్లు మంజూరయ్యాయి. బోరు బావులలో నీటిమట్టం పెంచడం, 24 గంటలు పంట పొలాలకు నీరు అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.

March 19, 2026 / 11:16 AM IST

తెలంగాణ తిరుమల దేవస్థానంలో పంచాంగ శ్రవణం

KMR: బీర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో గురువారం ఉగాది పర్వదిన సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయ పూజారి అభిషేక్ ఆచార్య పంచాంగ శ్రవణం భక్తులకు వినిపించారు. స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు.

March 19, 2026 / 11:15 AM IST

జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

నెల్లూరు: 98 రోజుల రిమాండ్ అనంతరం నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుంచి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

March 19, 2026 / 11:14 AM IST

ధురంధర్-2పై అల్లు అర్జున్ ప్రశంసలు

ధురంధర్-2 సినిమాలో దేశభక్తిని చాలా స్టైలిష్‌గా చూపించారని టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పేర్కొన్నాడు. మూవీలో చప్పట్లు కొట్టించే సీన్స్ ఎన్నో ఉన్నాయని.. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదొక బ్లాస్ట్ అంటూ ప్రశంసించాడు. రణ్‌వీర్ లాంటి నటుడు మన దేశంలో ఉండటం గర్వకారణమని, మాధవన్ సహా అందరూ అదరగొట్టారని కొనియాడాడు. భారతీయ కథను అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా తెరకెక్కించారన్నాడు.

March 19, 2026 / 11:12 AM IST