• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్లాస్టిక్‌పై విద్యార్థులకు అవగాహన

AKP: యలమంచిలిలోని శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన ప్రతిజ్ఞ నిర్వహించారు. ప్రిన్సిపల్ చంద్రశేఖర్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. కామర్స్ విభాగాధిపతి డా. చిట్టిబాబు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని విద్యార్థులకు సూచించారు.

March 19, 2026 / 07:30 AM IST

“గండికోట”కు ఉగాది సత్కారం

NLR : తెలుగు భాషాభివృద్ధి, ఉగాది విశిష్టత, రచనలపై మూడు దశాబ్దాలుగా పురాతన శాసనాల గురించి అవగాహన కల్పిస్తున్న బుచ్చికి చెందిన ఉపాధ్యాయులు, గండికోట సుధీర్ కుమార్ ఉగాది పురస్కారం అందుకున్నారు. వెంకటాచలం ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో సంచాలకులు మాడభూషి సంపత్ కుమార్ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆయనకు ప్రశంసా పత్రం అందజేశారు.

March 19, 2026 / 07:30 AM IST

BREAKING: జాబ్ క్యాలెండర్ వచ్చేసింది

AP: మంత్రి లోకేష్ 10,060 పోస్టులతో బాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. రాష్ట్ర యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగను ప్రకటిస్తున్నట్లు వెల్లడించిన ఆయన.. నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి, అన్ని పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం సంతోషంగా ఉందని.. ప్రతి ఏటా ఇలాగే ఉద్యోగ ప్రకటనలు ఉంటాయన్నారు.

March 19, 2026 / 07:30 AM IST

భద్రాచలంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

TG: భద్రాచలంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీన ముగియనున్నాయి. ఈనెల 27న శ్రీరామనవమిని పురస్కరించుకొని మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం, 28న పట్టాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణానికి సీఎం రేవంత్‌రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకురానుండగా.. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

March 19, 2026 / 07:25 AM IST

సెలవు దినాలు ల్లోనూ పన్నుల వసూలు

ATP: నేడు, రేపు, కూడా మున్సిపల్ పన్ను వసూలు కౌంటర్లు తెరిచి ఉంటాయని గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ ఎం.లక్ష్మీదేవి బుధవారం తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీ గడువు మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో సెలవు దినాల్లోనూ ఇంటి, కొళాయి పన్నులు చెల్లించే వెసులుబాటు కల్పించామన్నారు.

March 19, 2026 / 07:24 AM IST

ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం

SRCL: రంజాన్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు బుధవారం వేములవాడ స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో SDPO శ్రీనివాసులు, సీఐ వీర ప్రసాద్, ఎస్సై ఎల్ల గౌడ్ పాల్గొన్నారు. అధికారులు రంజాన్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలని, అపోహలు, వివాదాలు రాకుండా సహకరించుకోవాలని సూచించారు.

March 19, 2026 / 07:24 AM IST

‘ఏడాదిలో 1000 మంది అరెస్ట్’

ADB: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఏడాది కాలంలో 200 కేసులు నమోదు చేసి, 1000 మందిని జైలుకు పంపినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిందితుల్లో యువతే ఎక్కువగా ఉండటం ఆందోళనకరమని, గంజాయికి బానిసై బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని ఆయన హెచ్చరించారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.

March 19, 2026 / 07:21 AM IST

అలియా, ప్రియాంకకు అరుదైన గౌరవం

నేషనల్ జియోగ్రాఫిక్-2026 సంవత్సరానికి గాను ’33 మంది గ్లోబల్ ఛేంజ్ మేకర్స్’ జాబితాను విడుదల చేసింది. ఇందులో భారతీయ నటీమణులు అలియా భట్, ప్రియాంక చోప్రాకు చోటు లభించింది. పర్యావరణ సుస్థిరత, వాతావరణ మార్పులపై అవగాహన కల్పిస్తున్నందుకు అలియాను ఈ గౌరవం వరించింది. అలాగే ఆరోగ్య సంరక్షణ, ముఖ్యంగా డయాబెటిస్ పట్ల అవగాహన పెంచేందుకు ప్రియాంక చేస్తున్న కృషిని నెట్ జియో గుర్తించింది.

March 19, 2026 / 07:21 AM IST

ప్రజలకు ఉగాది,రంజాన్ శుభాకాంక్షలు : కలెక్టర్

KDP: జిల్లా ప్రజలందరికీ ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, ఆరోగ్య సౌభాగ్యాలను నింపాలని, అలాగే పవిత్ర రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 

March 19, 2026 / 07:20 AM IST

నేడే జాబ్ క్యాలెండర్ విడుదల

AP: ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇవాళ జాబ్ క్యాలెండర్-2026ను విడుదల చేయనుంది. ఈ ఏడాది 10060 పోస్టులను భర్తీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో టీచర్, పోలీస్, గ్రూప్స్, వర్సిటీ పోస్టులు ప్రధానంగా ఉండనున్నాయి. క్యాలెండర్ వచ్చాక ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపై స్పష్టత రానుంది. కాగా ‘ఇది ప్రకటన కాదు, నిరుద్యోగులకు కూటమి భరోసా’ అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

March 19, 2026 / 07:17 AM IST

‘కూటమి ప్రభుత్వం రైతులను దగా చేస్తోంది’

VZM: కూటమి ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని, అన్నదాత సుఖీభవ పథకంలో రైతులను భారీగా వంచన చేసిందని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస రావు అన్నారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేక, కనీస మద్దతు ధర లభించక, మొక్కజొన్న రైతులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన చెందారు. అదే విధంగా జిల్లాలో గ్యాస్ కొరతను ప్రభుత్వం తీర్చాలన్నారు.

March 19, 2026 / 07:17 AM IST

అంబులెన్స్‌లో ఈఎంటీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాల జిల్లాలోని 108 అంబులెన్స్‌ల్లో ఈఎంటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా 108 మేనేజర్ యశోద ఐలయ్య తెలిపారు. ఎంఎల్టీ, ఏఎన్ఎం, డీఎంఎల్టీ, బీ-ఫార్మసీ, నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 23న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ క్రిటికల్ కేర్ ఆస్పత్రి సమీపంలోని 108 కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు.

March 19, 2026 / 07:15 AM IST

చెడు లక్షణాల ఓటమే పరాభవ!

తెలుగు సంవత్సరాల్లో పరాభవ 40వది. ఈ ఏడాది పేరు పరాభవ. మనలోని అరిషడ్వర్గాలను జయిస్తే పరాభవమన్నది ఉండదని ఈ ఉగాది సందేశం. పరాభవ అంటే ఓడిపోవడం, అపజయం అనుకుంటున్నప్పటికీ.. బాహ్యప్రపంచంలో ఓడిపోవడం అనేది కాదు. బయటి శత్రువుల కంటే మనలోని చెడు ఆలోచనలను ఓడించడానికి ఈ ఏడాది సరైనది. అహంకారాన్ని విడనాడి, సత్యం, ధర్మం వైపు సాగేవారికి ఈ సంవత్సరం గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తుంది.

March 19, 2026 / 07:13 AM IST

పిడకల యుద్ధం..! ఎన్నో ఏళ్ల వింత ఆచారం.

KRNL: జిల్లాలోని ఆస్పరి మండలం కైరప్పలలో ఉగాది పండుగ సందర్భంగా వీరభద్ర ఆలయానికి ఓ ప్రత్యేక కథ ఉంది. భద్రకాళి, వీరభద్రుడి ప్రేమ వివాహం వివాదంగా మారిందని, పండుగ మరుసటి రోజు ఇక్కడి భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి పేడతో చేసిన పిడకలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ సంప్రదాయ భక్తిని కొనసాగిస్తారని పురాణాల్లో ఉంది.

March 19, 2026 / 07:11 AM IST

రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

W.G: తణుకు పట్టణం శివారు పాత బెల్లం మార్కెట్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తణుకు ఆకుల వారి వీధికి చెందిన పుదుకూడి కార్తీక్ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం సాయంత్రం బైక్‌పై ఇంటికి వస్తుండగా అదుపు తప్పి పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

March 19, 2026 / 07:11 AM IST