• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘రాజ్యాంగం పట్ల అవగాహనతోనే నవసమాజ నిర్మాణం’

GDWL: రాజ్యాంగం పట్ల అవగాహనతోనే భావి భారత పౌరులు ఉత్తమంగా ఎదుగుతారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గద్వాల్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన ఆడపిల్లల చదువు ఆవశ్యకత పోస్టర్, బాలల కోసం భారత రాజ్యాంగం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. సైన్స్ ప్రచారం మాత్రమే కాకుండా, సామాజిక అంశాలపై జేవీవీ చూపుతున్న చొరవను అభినందించారు.

February 21, 2026 / 07:22 AM IST

వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి: మాజీ సీఎం

KDP: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ CM,YS జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తాడేపల్లిలో ఉపాధ్యాయ MLC,YCP రామచంద్రారెడ్డి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలు కోసం ఉపాధ్యాయుల తరఫున పోరాటాలు చేస్తున్నామని జగన్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు.

February 21, 2026 / 07:20 AM IST

రేలకుంటకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాక

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రేలకుంట గ్రామంలో ఇవాళ SDF నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరు కానున్నారు. ఈ విషయాన్ని మండల పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

February 21, 2026 / 07:20 AM IST

ముగ్గురిపై దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

PDPL: గోదావరిఖని మార్కండేయ కాలనీలో శుక్రవారం ఆస్తి వివాదాలతో చిన్నాన్న కుటుంబంపై దాడి చేసిన రామ్ దూత్‌ను అరెస్టు చేసినట్లు ACP మడత రమేష్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొంతకాలం నుంచి రామ్ దూత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పక్కనే ఉన్న పిన్ని సుమిత్ర పాన్ షాప్ నుండి సిగరేట్ పొగ వస్తుండడంతో గొడవ జరుగుతుండేది. పథకం పన్ని ప్రణయ్, సుమిత్ర, కొమరమ్మపై కత్తితో పొడిచాడన్నారు.

February 21, 2026 / 07:20 AM IST

ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

NRPT: మరికల్ మండల కేంద్రంలోని జల లింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం భక్తులు శుక్రవారం రూ.50 వేలు వితరణ చేశారు. ఈ నగదును పట్టణ వీర సేవా సంఘం అధ్యక్షుడు శివప్రసాద్‌కు అందజేశారు. దాతల సహకారంతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు వీరభద్రప్ప, ప్రకాష్, బుచ్చప్ప తదితరులు పాల్గొని తమ ఉదారతను చాటుకున్నారు.

February 21, 2026 / 07:20 AM IST

నేటి నుంచి నీటి సరఫరాకు అంతరాయం

SKLM: పొందూరు మండలం రెల్లిగడ్డ వద్ద ఉన్న మంచినీటి పైపులు మరమ్మతులకు గురైనట్లు పంచాయతీ ఈవో పొన్నాడ జగదీశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున నేటి నుంచి నాలుగు రోజులు పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని తెలిపారు. మరమ్మతుల అనంతరం యధావిధిగా సరఫరా ఉంటుందన్నారు.

February 21, 2026 / 07:20 AM IST

నేడు అన్ని పాఠశాలల్లో PTA సమావేశం

KMR: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేడు తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం(PTA) నిర్వహించాలని DEO రాజు ఆదేశించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలన్నారు. విద్యార్థుల ప్రగతి, హాజరు శాతంపై టీచర్లు, తలిదండ్రులు చర్చించాలన్నారు. పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల పట్ల ఇంటి వద్ద ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా సూచనలు చేయాలన్నారు.

February 21, 2026 / 07:20 AM IST

నేడు ఎంపీడీవో కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక

ATP: గుత్తి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో శనివారం ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, తెలిపారు. వారు మాట్లాడుతూ.. 2024 ఏప్రిల్, 1వ తేదీ నుంచి 2025 మార్చి, 31వ తేదీ వరకూ మండలంలోని 24 పం చాయతీలలో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి సామాజిక తనిఖీలు నిర్వహించారన్నారు.

February 21, 2026 / 07:19 AM IST

‘ఉద్యోగుల గ్రీవెన్స్‌ను ఉద్యోగులు వినియోగించుకోవాలి’

అల్లూరి: ప్రతినెలా 3వ శుక్రవారం నిర్వహించే ఉద్యోగుల గ్రీవెన్స్‌ను ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో లోకేశ్వరరావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఉద్యోగుల గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ సమస్యలతో వచ్చిన రెవెన్యూ, సచివాలయ శాఖల ఉద్యోగుల నుంచి అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

February 21, 2026 / 07:18 AM IST

మల్లన్న సేవలో కార్మిక శాఖ మంత్రి

NDL: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రికి అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటంతో మంత్రిని ఘనంగా సత్కరించారు.

February 21, 2026 / 07:18 AM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే సమీక్ష

సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి (CHC)ని నేడు ఉదయం ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సందర్శించనున్నారు. ఆసుపత్రిలో అమలవుతున్న బయోమెడికల్ వ్యర్థాల బార్కోడ్ సిస్టమ్‌ను పరిశీలించడంతో పాటు రోగులతో మాట్లాడి పరిశుభ్రతపై అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. శానిటేషన్ సిబ్బందితో వ్యర్థాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు.

February 21, 2026 / 07:17 AM IST

రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు

BPT: పిట్టలవానిపాలెం మండలంలోని రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద పోలీసులు శుక్రవారం ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. చందోలు ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో వాహనదారుల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.

February 21, 2026 / 07:17 AM IST

నిర్జీవ స్థితిలో నవజాత శిశువు.. కాపాడిన 108 సిబ్బంది

KMR: పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గాంధారి మండలానికి చెందిన మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, పుట్టిన వెంటనే శిశువు ఏడవకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వైద్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యంలో శిశువు ఆరోగ్యం క్షీణించింది. సిబ్బంది సమయస్ఫూర్తితో ప్రాథమిక చికిత్స అందించి పసికందును కాపాడినట్లు తెలిపారు.

February 21, 2026 / 07:17 AM IST

కేజీబీవీ మెరిట్ జాబితా విడుదల

MBNR: జిల్లాలోని వివిధ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) ఖాళీగా ఉన్న ఏఎన్ఎం (ANM), అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల మెరిట్ జాబితాను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. ఈ జాబితాను palamurubadi.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. మెరిట్ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన సూచించారు.

February 21, 2026 / 07:16 AM IST

‘సర్వేయర్లు భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి’

MNCL: లైసెన్స్ సర్వేయర్ శిక్షణ పొందిన వారికి మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య ధ్రువపత్రాలు అందజేశారు. భూ సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన సర్వే పనులను లైసెన్సుడ్ సర్వేయర్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

February 21, 2026 / 07:16 AM IST