GDWL: రాజ్యాంగం పట్ల అవగాహనతోనే భావి భారత పౌరులు ఉత్తమంగా ఎదుగుతారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గద్వాల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన ఆడపిల్లల చదువు ఆవశ్యకత పోస్టర్, బాలల కోసం భారత రాజ్యాంగం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. సైన్స్ ప్రచారం మాత్రమే కాకుండా, సామాజిక అంశాలపై జేవీవీ చూపుతున్న చొరవను అభినందించారు.