జగిత్యాల జిల్లాలోని 108 అంబులెన్స్‌ల్లో ఈఎంటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా 108 మేనేజర్ యశోద ఐలయ్య తెలిపారు. ఎంఎల్టీ, ఏఎన్ఎం, డీఎంఎల్టీ, బీ-ఫార్మసీ, నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 23న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ క్రిటికల్ కేర్ ఆస్పత్రి సమీపంలోని 108 కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు.