TG: HYD మాధాపూర్‌లో డ్రగ్స్ కలకలం రేపింది. శేరిలింగంపల్లి STF టీమ్ సోదాలు చేసి రూ.2.3 లక్షల విలువైన 920 గ్రా. వీడ్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేయగా.. ఐదుగురు పరారయ్యారు. నిందితుడు పరుసముల దినేష్(28) కారు మెకానిక్ కాగా, పరారీలో ప్రధాన సరఫరాదారు ప్రవీణ్, కస్టమర్లు యూసుఫ్, శరత్, విన్ని, చందు, రేవంత్ పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.