తన బౌలింగ్ ప్రదర్శన, చిలిపి చేష్టలతో అభిమానులు ఎంతగానో అలరించే యుజ్వేంద్ర చాహల్ IPL 2026 కోసం సిద్ధమవుతున్నాడు. పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతున్న చాహల్, తన ప్లాన్స్ గురించి ABDతో చెప్తూ.. ‘6 నెలలుగా మందు ఆనేశా. 35 ఏళ్లలో చాలా ఉత్సాహంతో, జట్టు కోసం 150% కృషి చేయాలనుకుంటున్నా. సీనియర్ ఆటగాడిగా నలుగురు నా నుంచి నేర్చుకునేలా విజృంభించాలని భావిస్తున్నా’ అని పేర్కొన్నాడు.
MDCL: చిల్కానగర్ డివిజన్‌లో పెండింగ్ పనులపై మాజీ కార్పొరేటర్ బన్నాల గీత స్పందించారు. సాంక్షన్ అయిన పనులను వెంటనే ప్రారంభించకపోతే కాంట్రాక్టర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సివరేజ్ పనుల తర్వాత రోడ్లు పునరుద్ధరించని వారి పై చర్యలు తీసుకోవాలని కోరారు. లో ప్రెషర్ నీటి సమస్య పరిష్కరించాలని జీఎంను కోరగా, అధికారులు సానుకూలంగా స్పందించారు.
KRNL: మద్దికేర మండలం శ్రీ పెరవలిలో వెలసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానానికి గుడిపాడుకు చెందిన జక్కల రంగస్వామి ఆలయ అభివృద్ధికి తమ వంతు సాయంగా రూ.30 వేలు, జి.ఈశ్వరయ్య రూ.10 వేలు ఆలయ ఛైర్మన్ పారా రవికుమార్, ప్రధాన అర్చకుడు రంగనాథ స్వామి, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో అందజేశారు. ఈ నగదును ఆలయ అభివద్ది కోసం ఉపయోగించాలని కోరారు.
KMR: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కామారెడ్డి ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తులో పారదర్శకత కీలకమన్నారు. CCTNSలో వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, ఎఫ్ఎఆర్ నుంచి ఛార్జ్ షీట్ వరకు తప్పుల్లేకుండా నమోదు చేయాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయంలో ఉగాది కవి సమ్మేళనం నిర్వహించినట్లు యురవే అధ్యక్షురాలు తంగి ఎర్రమ్మ గురువారం తెలిపారు. యువ తెలుగు రచయితలను ప్రోత్సహించడానికి యురవే ప్రోత్సాహాన్ని, మార్గదర్శకత్వం అందిస్తుందన్నారు. తెలుగు భాషా మాధుర్యాన్ని, కొత్త భావాలను అందిపుచ్చుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కవులు తమ కవిత్వాలను చదివి వినిపించారు.
NDL: బేతంచెర్ల మండలం గోరుమానుకొండ మోడల్ స్కూల్‌లో జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ దాస్ తెలిపారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలని సూచించారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మే 5న మెరిట్ లిస్ట్, 6న సెలెక్షన్ లిస్ట్ విడుదల అవుతాయని వెల్లడించారు.
PDPL: జిల్లాకు చెందిన 20 మంది అమ్మాయిలను కలెక్టర్ శ్రీహర్ష ఆధ్వర్యంలో ఆరు నెలల ఎయిర్ హోస్టెస్ శిక్షణ నిమిత్తం హైదరాబాద్ గో ఫ్లై ఇంటర్నేషనల్ సంస్థలో చేర్పించారు. వీరిలో 12 మంది ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందించి, సన్మానించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ విశ్వరూపిణి, వ్యాయామ ఉపాధ్యాయులు కుమార్ పాల్గొన్నారు.
PPM: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులకు జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా క్రమశిక్షణ, దానగుణం, భక్తికి రంజాన్ పండగ ప్రతికని అని అన్నారు. నెలరోజులపాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి, క్రమ శిక్షణతో కూడిన జీవనం సాగించడం అభినందనీయమన్నారు.
కడప: కలెక్టరేట్ సభా భవన్‌లో శ్రీ పరాభవనామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితుడు నాగాంజనేయ శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించగా, నలుగురు పండితులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం సభికులను అలరించాయి.
KDP: కాశీనాయన(M) సావిశెట్టిపల్లెలో బుధవారం సాయంత్రం గాలితో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షం కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన అరటి, మొక్కజొన్న, సజ్జ కోత జరుగుతుండగా గాలివాన వర్షం బీభత్సం సృష్టించడంతో రైతులు కుదేలయ్యారు. కాశీనాయన మండలంలో దాదాపు 200 ఎకరాల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. అధికారులు న్యాయం చేయాలని రైతులు కోరారు
అసోం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ జాలుక్‌బారి అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నారు. జాలుక్‌బారి హిమంతకు కంచుకోట. 2001, 2006, 2011, 2016, 2021లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలన్నింటిలోనూ ఆయన ఈ నియోజకవర్గం నుంచే విజయం సాధించారు.
W.G: ఆకివీడు శ్రీ వనువులమ్మ దేవస్థానం అర్చకుడు లంక నరసింహారావుకు ఉగాది పురస్కారం లభించింది. భీమవరంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదుగురు అర్చకులకు ఈ గౌరవం దక్కగా, బీఎస్ఎన్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. పురస్కారం అందుకోవడంపై నరసింహారావు హర్షం వ్యక్తం చేశారు.
SRPT: మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలోని కౌసర్, మదీనా మస్జిద్‌ల వద్ద గురువారం రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ కరీం ముఖ్య అతిథులుగా హాజరై పేద ముస్లిం కుటుంబాలకు ఈ కిట్లను అందజేశారు. రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీక అని వారు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్‌లో హనుమాన్ మందిరం పునర్నిర్మాణం కోసం గురువారం సొసైటీ మాజీ ఛైర్మన్ కొండ గంగాధర్ రూ.1,11,111 విరాళం అందజేశారు. పురాతన ఆలయాన్ని అభివృద్ది చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు, హనుమాన్ స్వాములు, గ్రామస్థులు పాల్గొన్నారు
VZM: శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ రాజమన్నార్ వేణుగోపాల స్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ అప్పలనాయుడు, కలెక్టర్ హజరయ్యారు.