• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి ఆనం

NLR: ఆత్మకూరులో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 70 మందికి రూ.44.63 లక్షల చెక్కులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం అందించారు. అలాగే ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామానికి చెందిన నరసింహారెడ్డికి పార్టీ సభ్యత్వం ఉండి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అతని కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును మంత్రి అందించారు.

March 18, 2026 / 10:51 AM IST

రాజకీయాల్లో నటీమణులను లాగొద్దు: మంచు విష్ణు

తమిళనాడు రాజకీయ వివాదాల్లోకి నటీమణులను లాగడంపై నటుడు మంచు విష్ణు తీవ్రంగా స్పందించాడు. రాజకీయ లబ్ధి కోసం సినీ తారల వ్యక్తిగత జీవితాలను వాడుకోవడం అత్యంత అసభ్యకరమని మండిపడ్డాడు. నటీనటులకు కూడా భావోద్వేగాలు, కుటుంబాలు, గౌరవం ఉంటాయని.. వారి ప్రైవేట్ స్పేస్‌ను సమాజం గౌరవించాలని హితవు పలికాడు. రాజకీయ విమర్శల్లో నటీమణులను కించపరచడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశాడు.

March 18, 2026 / 10:50 AM IST

గ్యాస్ కంపెనీ వద్ద వినియోగదారుల పడిగాపులు

E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరంలో ఉన్న గ్యాస్ కంపెనీ వద్ద వినియోగదారులు బుధవారం పడిగాపులు కాస్తున్నారు. బుకింగ్ చేసుకున్నప్పటికీ సిలిండర్లు సకాలంలో ఇంటికి చేరకపోవడంతో ప్రజలు ఏజెన్సీ కార్యాలయానికి వచ్చారు. మరో పక్క గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నారు. డెలివరీ ఆలస్యమైతే సంబంధిత కంపెనీ హెల్ప్‌లైన్ నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

March 18, 2026 / 10:50 AM IST

అలర్ట్: ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ

KDP: మండల కేంద్రమైన సింహాద్రిపురంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని పాఠశాల SO గురుదేవి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఖాళీగా ఉన్న తొమ్మిది సీట్లకు, 6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.

March 18, 2026 / 10:50 AM IST

మహానగరంలో కల్తీకి అడ్డాగా.. ఈ ప్రాంతాలు.!

HYD: మహానగరంలో అత్తాపూర్, అఫ్జల్‌గంజ్, రాజేంద్రనగర్, మైలార్దేవ్ పల్లి, పాతబస్తీ ఏరియాలో కల్తీ పదార్థాల తయారీకి అడ్డాగా మారుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల వ్యవధిలో కల్తీ పదార్థాలు పట్టుబడ్డ వాటిల్లో అత్యధికంగా ఈ ప్రాంతాలు ఉన్నట్లు అధికారిక యంత్రం గుర్తించింది. ఈ ప్రాంతాలను ఎంచుకోవడం వెనక ఆంతర్యం ఏమిటి..? అనే దాని పై విచారణ సాగుతోంది.

March 18, 2026 / 10:49 AM IST

కురుమూర్తి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

MBNR: చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నేడు అమావాస్య, రేపు ఉగాది పండుగ కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ పెరిగింది. గోవింద నామస్మరణతో కురుమూర్తి గిరులు మారుమోగుతున్నాయి. రేపు కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు.

March 18, 2026 / 10:49 AM IST

తండ్రి మరణించినా.. పరీక్షకు హాజరు..!

SRCL: తండ్రి మృతి చెందినా పది పరీక్షకు హాజరయ్యాడు ఓ విద్యార్థి. ఎల్లారెడ్డిపేటలో బీజేపీ నాయకుడు చందుపట్ల రాజిరెడ్డి గుండెపోటుతో బుధవారం మరణించాడు. అతని కుమారుడు అక్షిత్ రెడ్డికి పదవ తరగతి పరీక్ష ఉండటంతో బుధవారం పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. పరీక్ష ప్యాడ్ తీసుకొని పరీక్ష కేంద్రానికి వెళుతున్న అక్షిత్ రెడ్డిని చూసి కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు.

March 18, 2026 / 10:49 AM IST

యుద్ధం ఎఫెక్ట్.. భారీగా కోడిగుడ్ల నిల్వలు

WGL: యుద్ధం కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోడిగుడ్ల నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. సుమారు 70 లక్షల కోళ్లు ఉండగా రోజుకు 50 నుంచి 60 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. గల్ఫ్ దేశాలకు భారీ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. కేవలం 20 శాతం గుడ్లు మాత్రమే స్థానిక మార్కెట్‌కు చేరుతుండటంతో మిగిలిన నిల్వలన్నీ షెడ్లలో ట్రేలలో పేరుకుపోతున్నాయి.

March 18, 2026 / 10:48 AM IST

ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ

TG: ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతోంది. ఈ ఉదయం 11 గంటలకు ఆయన పార్లమెంట్‌కు వెళ్లనున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఆయనతో పాటు ఉంటారు. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలిసే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి, పార్టీ వ్యవహారాలపై చర్చించిన అనంతరం, మధ్యాహ్నం ఆయన తిరిగి HYDకు బయలుదేరుతారు.

March 18, 2026 / 10:46 AM IST

లబ్ధిదారికి కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ

SRPT: మునగాల మండలంలోని కలకోవకి చెందిన లబ్ధిదారికి ఇవ్వాళ రూ.1,00,116 కళ్యాణ లక్ష్మి చెక్కును తహసీల్దార్ సరిత అందజేశారు. ఈ సందర్భంగా పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శంకర్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

March 18, 2026 / 10:45 AM IST

నందవరం చౌడేశ్వరి మాతకు విశేష పూజలు

NDL: బనగానపల్లె (M) నందవరంలో చౌడేశ్వరి మాతకు బుధవారం చతుర్దశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారిని పసుపు పారాయణంతో అలంకరించారు. వేద పండితులు కుంకుమార్చన, రుద్రాభిషేకం, మహామంగళహారతి నిర్వహించారు. చతుర్దశి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

March 18, 2026 / 10:45 AM IST

కోర్టు ప్రాంగణంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా జడ్జి

నిర్మల్ పట్టణంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం జిల్లా జడ్జి శ్రీవాణి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేసవి కాలంలో కోర్టుకు వచ్చే ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో న్యాయ సేవ సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

March 18, 2026 / 10:42 AM IST

కొండలెక్కిన పైపులు.. తీరనున్న నీటి కష్టాలు

AKP: వి.మాడుగుల మండలం అవురువాడ పంచాయతీ పరిధిలోని పశువులబంద PVTG కొందు గిరిజన గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కానుంది. RWS అధికారులు గ్రామాన్ని సందర్శించి పైప్‌లైన్ పనులను ప్రారంభించారు. ఎత్తైన కొండ ప్రాంతం కావడంతో గిరిజనులే మంచినీటి పైపులను మోసుకుంటూ గ్రామానికి తీసుకెళ్తున్నారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

March 18, 2026 / 10:41 AM IST

సేవాలాల్ చిన్న రాష్ట్ర వర్కింగ్ జనరల్ సెక్రటరీగా రఘువీర్

MHBD: సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ జనరల్ సెక్రటరీ, చీఫ్ కో-ఆర్డినేటర్‌గా రఘువీర్ రాథోడ్ నియామకం అయ్యారు. HYD ఉస్మానియా యూనివర్సిటీలో సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా సంజీవ్ నాయక్, రాష్ట్ర అద్యక్షులు బానోతు హుస్సేన్ నాయక్ చేతుల మీదుగా మంగళవారం ఆయన నియామకపత్రాన్ని అందుకున్నారు. లంబాడి, గిరిజనుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.

March 18, 2026 / 10:40 AM IST

మాజీ మంత్రి ఇంట్లో చోరీ

AP: కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తాళం పగలగొట్టి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఈశ్వర్‌కుమార్ సతీమణి మధురిమ రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి తిరిగి రాగానే.. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. సుమారు 10 కిలోల వెండి, పూజా సామాగ్రి అపహరణకు గురైనట్లు గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

March 18, 2026 / 10:40 AM IST