CTR: మున్సిపాలిటీకి బకాయి ఉన్న పన్నుపై ప్రభుత్వం 50 శాతం మాఫీ ప్రకటించిందని నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజి నాయక్ తెలిపారు. ఈ నెల 31వ తేదీ లోపు చెల్లించవలసిన బకాయిలు మొత్తంలో ఒక్కసారిగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం మాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇప్పటికే వసూలు చేసిన వడ్డీ భవిష్యత్లో సర్దుబాటు చేస్తామన్నారు.