PLD: పెదకూరపాడులోని ప్రియా హోటల్ సెంటర్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య తీవ్ర తరమవుతోంది. మంగళవారం సాయంత్రం మిర్చి టిక్కీలతో వెళ్తున్న ట్రాక్టర్లు ఒకేసారి ఎదురుకావడంతో బస్సులు, ఇతర వాహనాలు గంటల తరబడి నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని స్థానికులు వాపోతున్నారు.