TG: డీలిమిటేషన్ అనేది చాలా ప్రమాదకర దిశలో వెళ్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలకు మోదీ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మహిళలను రాష్ట్రపతి, గవర్నర్లు, సీఎంలుగా కాంగ్రెస్ నియమించిందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కాదు.. 2026 జనాభా లెక్కల ప్రకారం డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.